ఎవరికీ కూడా ఇక మీదట దాడి చేసే అంత ధైర్యం రాకూడదని చూడాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వారి మీద కేసులు బనాయించడం పట్టుకోవడం వంటి వాటి గురించి ఎక్కువగా నడుస్తోంది. అయితే వాళ్లను విడిపించుకోవడం రక్షణ కల్పించుకునే బాధ్యత కూడా అటు వైసిపి పార్టీకి నేతలకు ఉన్నది. గన్నవరానికి సంబంధించి దాదాపుగా 30 మందికి సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్లు పేర్లు పెట్టినటువంటి వార్లని అరెస్టు చేయడానికి వీలు లేకుండా తాజాగా సుప్రీంకోర్టు ఆదేశాలను జారీ చేసిందట.
వీరందరిని అరెస్టు చేయవద్దని సుప్రీంకోర్టు తెలిపింది..వల్లభనేని వంశీని నమ్ముకున్నటువంటి వాళ్లలో కొంతమంది ఇప్పటికే అరెస్టు అయ్యి జైల్లో ఉన్నప్పటికీ.. మిగతా వాళ్ళని సుప్రీం కోర్టు వరకు తీసుకెళ్ళి ఆపుకోగలిగాడు.. అలాగే ఇక్కడ దేవినేని అవినాష్, అలాగే సజ్జల, అలాగే తలసల రఘురాం ఇలాంటోళ్లు అక్కడే ఊరట పొందారని చెప్పవచ్చు.. అంటే అనేకమంది సుప్రీంకోర్టు దగ్గరకు వెళ్లి ఊరట పొందాల్సి వస్తోంది అరెస్టులు కాకుండా మరి రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సిపి పార్టీ ఎలాంటి నిర్ణయాలను తీసుకుంటుందో చూడాలి.