ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడు రసవత్తరంగానే ఉంటాయి.. ఇక్కడ ఎప్పుడైనా టీడీపీ వర్సెస్ కాంగ్రెస్ అనే విధంగా ఉండేది. కానీ ప్రస్తుతం కాంగ్రెస్ కనుమరుగైపోయి  ఆ స్థానాన్ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధిరోహించిందని చెప్పవచ్చు.. ఇదే తరుణంలో పవన్ కళ్యాణ్ కూడా జనసేన పార్టీ పెట్టి ఏపీలో తన పార్టీని ఫామ్ లోకి తీసుకొచ్చారు. ఇదే తరుణంలో మొన్నటి ఎలక్షన్స్ లో టీడీపీతో జతకట్టి చివరికి అధికారాన్నే చేజిక్కించుకున్నారు.. హోరాహోరీ సాగినటువంటి ఈ పోటీలో టీడీపీ కూటమి  విజయాన్ని అందుకుంది. ఇదే తరుణంలో  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చిత్తుచిత్తుగా ఓడిపోవడంతో  ఆ పార్టీని నమ్ముకున్న చాలామంది నేతలు ఆందోళన చెందుతూ వస్తున్నారు. ఎప్పుడైతే వైసీపీ ఓడిపోయిందో అప్పటినుంచి జగన్  అంతగా జనాల్లోకి రావడం లేదు..

 ఇక ప్రతిపక్షం అంత బలంగా  లేకపోవడంతో తాను చేసిందే వేదం అన్నట్టుగా  టీడీపీ ముందుకు వెళుతుంది. అంతేకాదు వైసీపీ నాయకులు కూడా చాలావరకు సైలెంట్ అయిపోయారు. ఇదే తరుణంలో జగన్ టిడిపి చేస్తున్న పనులపై మళ్ళీ పోరాటం చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది.. ఎన్నికలకు ముందు టీడీపీ కూటమి ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో వెనుకబడిపోయిందని, పేద ప్రజలకు సరైన సౌకర్యాలు అందడం లేదని  వైసిపి పార్టీ భావిస్తుందట. అంతేకాకుండా జగన్  ఇక జనాల్లోకి వచ్చి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చేలా చేయడానికి సిద్ధమవుతున్నారట. గత నెల రోజుల క్రితం బ్రిటన్ వెళ్లినటువంటి జగన్మోహన్ రెడ్డి అక్కడే కుటుంబంతో గడిపారు.

ప్రస్తుతం తన  కూతురు చదువులు పూర్తయ్యాయని, ఇక ప్రజా కోణం వైపు ఆయన వెళ్లనున్నారని తెలుస్తోంది. ఇదే తరుణంలో బ్రిటన్ నుంచి ఇప్పటికే ఆయన ఇండియాకు చేరుకొని అక్కడి నుంచి బెంగళూరు చేరుకున్నారు. అక్కడ రెండు రోజులపాటు ఉండి  ఆ తర్వాత అమరావతి లేదా తాడేపల్లి తన ఇంటికి రాబోతున్నారట. ఇక అక్కడి నుంచి తాను  ప్రజల్లోకి వెళ్లడానికి కసరత్తులు తయారు చేసుకుంటున్నారట.. దీంతో జగన్ మళ్లీ ప్రజల్లోకి రాబోతున్నారని తెలిసి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాస్త ఆనందంలో ఉన్నారు. టీడీపీ నాయకులేమో పండగలకు వచ్చిపోయే నాయకుడు అంటూ విమర్శిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: