గత ఐదేళ్లపాటు ఎన్నో కష్టాలు పడి ఎన్నో పోరాటాలు చేసి అధికారంలోకి వచ్చింది. తెలుగుదేశం పార్టీ ఈ క్రమంలోనే తెలుగుదేశం ఈసారి మహానాడు ను కడపలో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు నివాసంలో టిడిపి పోలిట్ బ్యూరో సమావేశం సుదీర్ఘంగా సాగింది. ఈ క్రమంలోనే మహానాడు ను కడపలో నిర్వహించాలని నిర్ణయించారు. పార్టీ చరిత్రలోనే విశేషమైన గెలుపు సాధించినందున ఈసారి మహానాడు రెండు రోజులు పాటు నిర్వహించనున్నారు. గత ఎన్నికల్లో కూటమి కడపలో 7 సీట్లలో ఘనవిజయం సాధించింది. గత మూడు దశాబ్దాల పార్టీ చరిత్రలో కడప జిల్లా పరంగా చూస్తే ఇదే అతి పెద్ద విజయం పార్టీ బద్వేలు, రాజంపేట, పులివెందుల నియోజకవర్గాలలో మాత్రమే ఓడిపోయింది.
అందులోనూ బద్వేలు రాజంపేట నియోజకవర్గాలలో చేజేతులా ఓడిపోయింది. ఏడు సీట్ల తో కూటమి ఘనవిజయం సాధించడంతో ఈసారి అక్కడ మహానాడు నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. టిడిపి మహానాడు ను ప్రతి రెండేళ్లకోసారి నిర్వహిస్తోంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయంలో కడప జిల్లా ఆ కుటుంబానికి కంచుకోట గా మారింది. ప్రతి ఎన్నికల్లో ఒక్క సీటు గెలుచుకోవడమే టిడిపికి గగనం అయింది. 2019 ఎన్నికలలో ఒక్క సీటు కూడా రాలేదు. వైఎస్ చనిపోయిన తర్వాత సెంటిమెంట్ ఊపులో జగన్ మంచి ఫలితాలు సాధించిన అధికారం అందిన తర్వాత వైసిపి అక్కడ బలహీనపడుతూ వచ్చింది.
దీనికి తోడు వయసుకు కుటుంబంలో చీలిక కూడా వచ్చింది. వివేక హత్యకేసు తర్వాత జగన్కు కడప జిల్లాలో క్రేజ్ తగ్గింది. చివరికి సొంత చెల్లి .. తల్లి కూడా దూరం కావడంతో ఆయనను నమ్మేవారి సంఖ్య తగ్గింది. కడపలో వైసిపిని మరింతగా దెబ్బ కొడితే ఇక ఆ పార్టీ పునాదులు కదిలిపోతాయని అందరూ అంచనా వేస్తున్నారు. అందుకే కడపలో సుదీర్ఘంగా పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించడంతో పాటు కొత్త నాయకత్వాన్ని ఎంకరేజ్ చేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. చంద్రబాబు త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలలో పులివెందుల - కడపలో కూడా గెలిచేందుకు టిడిపి మహానాడు వేదికగా ప్రణాళికలు సిద్ధం చేసుకోనుంది.