వైసీపీ మాజీ నాయకులు విజయసాయి రెడ్డి మనసంత రాజకీయాలపైనే కొట్టుకుంటున్నట్లు తెలుస్తోంది. రాజకీయాలకు గుడ్ బై చెప్పిన విజయసాయి రెడ్డి... పదేపదే  సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ... తానింకా రిటర్మెంట్ ప్రకటించలేదని చెప్పకనే చెబుతున్నారు.  రాజకీయాలకు గుడ్ బై చెప్పిన తర్వాత నిత్యం సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్ట్ పెట్టి.. వైసీపీలో ఊపు తెస్తున్నారు విజయసాయిరెడ్డి. తాజాగా విజయసాయిరెడ్డి చేసిన పోస్ట్ చూస్తే... ఆయన రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది.


2029 ఎన్నికల గురించి తాజాగా పోస్ట్ పెట్టి రచ్చ చేశారు. 2029 సంవత్సరంలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు తీసుకోవాలని కోరుతున్నట్లు... స్వీట్ చేశారు విజయసాయిరెడ్డి. దీంతో.. 2029 సంవత్సరం నాటికి... విజయసాయిరెడ్డి రీ ఎంట్రీ ఇస్తారని అంటున్నారు. అంతేకాదు ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు విజయసాయిరెడ్డి.


వైసిపి పార్టీ సభ్యత్వానికి అలాగే పార్టీ పదవులకు తాజాగా రాజీనామా చేసినట్లు  పేర్కొన్న విజయసాయిరెడ్డి... తన రాజీనామా పత్రాలను వైయస్ జగన్మోహన్ రెడ్డికి పంపించినట్లు గుర్తు చేశారు.  అలాగే 2029 అసెంబ్లీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి భారీ మెజారిటీతో... ముఖ్యమంత్రి అవుతారని.. అదే తన కోరిక అని వివరించారు. అలాగే తనకు రాజకీయంగా అండగా నిలిచిన జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వైసిపి పార్టీ నేతలకు  భరోసా కల్పించే ప్రయత్నం చేశారు.


శత్రుత్వాలకు అలాగే అపార్థాలకు అవకాశం ఇవ్వని విధంగా... తను వ్యవసాయం చేసుకుంటున్నానని వెల్లడించారు. అయితే 2029 అసెంబ్లీ ఎన్నికల గురించి  తన ట్వీట్ లో విజయసాయిరెడ్డి ప్రస్తావించడంతో... ఆయన మళ్లీ రీఎంట్రీ ఇస్తాడని అంటున్నారు. అప్పటివరకు కాస్త సైలెంట్ గా ఉండి... మళ్లీ రాజకీయాల్లోకి రావాలని ఆయన ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం అందుతుంది. ఈ ట్వీట్ చూసిన వాళ్లు కూడా అదే చెబుతున్నారు. విజయసాయిరెడ్డి రాజకీయాలను అస్సలు వదల బోడని... కొన్ని రోజులు మాత్రమే రాజకీయాలకు దూరంగా ఉండే అవకాశాలు ఉన్నాయంటున్నారు.





మరింత సమాచారం తెలుసుకోండి: