కేంద్ర బడ్జెట్ “2025-26” కు రంగం సిద్ధం అయింది. లోకసభలో నేడు బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్. వరుసగా 8 వ సారి కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నారు ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్. వరుసగా మూడవ సారి మోడి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రవేశ పెడుతున్న తొలి బడ్జెట్ ఇదే కావడం గమనార్హం. ఎన్.డి.ఏ కూటమి అధికారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ కు కొంత ఆర్దిక తోడ్పాటును అందించే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.


ఇక ఈ రోజు ఉదయం 11 గంటలకు లోకసభ లో ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం ప్రారంభం కానుంది. ప్రస్తుత ఆర్దిక సంవత్సరం (2025-26) లో రూ. 53 లక్షల కోట్ల మేరకు కేంద్ర బడ్జెట్ ఉండే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.   గత ఆర్దిక సంవత్సరం (2023-25)  కేంద్ర బడ్జెట్  48 లక్షల 20 వేల కోట్ల రూపాయలు ఉన్న సంగతి తెలిసిందే. గత ఏడాది(2024-25) బడ్జెట్ లో రుణాల రూపంలో  మొత్తం రూ. 14 లక్షల కోట్లు సమకూర్చుకుంటామని  కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనలు  సిద్ధం చేసినట్లు సమాచారం అందుతోంది.
 

అయితే, ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో మాత్రం, అంత మొత్తం లో రుణాలు తీసుకునే పరిస్థితి ఉండదని అంచనా వేస్తున్నారు. ప్రస్తుత అర్ధిక సంవత్సరంలో సమాన్యుడికి, మధ్యతరగతి ప్రజలకు కొంత ఉపశమనం, ఊరట కలిగించే నిర్ణయాలు ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.  ఆదాయపు పన్నుల్లో  ప్రస్తుతం ఉన్న  “శ్లాబ్ లు” కాకుండా, అదనంగా కొత్త శ్లాబ్ లు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది.  బలహీనపడిపోతున్న “స్టాక్ మార్కెట్” కు ఊతం ఇచ్చే చర్యలు ఉండే అవకాశం ఉందట.

“సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ టాక్స్” (షేర్లు అమ్మినా, కొన్నా పన్ను) ను కొంతమేరకు తగ్గించే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. “లాంగ్ టర్మ్ కాపిటల్ గెయిన్ టాక్స్” కూడా బాగా తగ్గించే అవకాశం ఉంది.  నిరుద్యోగ సమస్యకు పరిష్కారంగా, కొత్త పరిశ్రమలు పెట్టే విధంగా కొన్ని ప్రోత్సకాలు ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతం అలాంటి ప్రోత్సాహాకాలు పొందుతున్న 14 పరిశ్రమల జాబితాలో, అదనంగా మరి కొన్నింటిని చేర్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: