కేంద్ర ప్రభుత్వం పథకాల విషయంలో ఏ విధంగా వ్యవహరించనుందనే చర్చ జోరుగా జరుగుతోంది. ప్రధానంగా ఆదాయపు పన్ను చెల్లింపుదారుల విషయంలో కేంద్రం ఎలాంటి నిర్ణయాలతో ముందుకు వెళ్తుందనే చర్చ సైతం మొదలుకావడం గమనార్హం. పన్ను మినహాయింపుల విషయంలో కేంద్రం ఏ విధంగా ముందడుగులు వేస్తుందో చూడాల్సి ఉంది.
పలు పథకాలకు సంబంధించి ఇచ్చే మొత్తాన్ని మోదీ సర్కార్ పెంచే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పథకాల అమలు విషయంలో ఏ విధంగా ముందుకెళ్తుందో చూడాల్సి ఉంది. ఇళ్లులేని పేద, మధ్య తరగతి ప్రజల గృహ నిర్మాణం కోసం కేంద్రప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని మొదలుపెట్టగా ఈ స్కీమ్ ద్వారా పట్టణ ప్రాంతాల్లో ఏకంగా 2.50 లక్షల రూపాయలు పొందే అవకాశం ఉంటుంది.
స్టార్టప్ లకు భారీ రాయితీలు, ఆదాయపు పన్ను మినహాయింపు లాంటి నిర్ణయాల దిశగా మోదీ సర్కార్ అడుగులు వేస్తోంది. రూ.5 లక్షల వరకు పన్ను మినహాయింపు పరిమితిని పొడిగించే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలిసే ఛాన్స్ అయితే ఉంది. పన్ను మినహాయింపు పరిమితిని పెంచే అవకాశం ఉన్నట్లు జరుగుతున్న ప్రచారం హాట్ టాపిక్ అవుతోంది. మోదీ సర్కార్ పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలకు మేలు జరిగేలా నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందని నెటిజన్ల నుంచి సైతం కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. నెటిజన్ల నుంచి ప్రశంసలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.