కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారనే సంగతి తెలిసిందే. 2019 సంవత్సరంలో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రోజు నుంచి ఈరోజు వరకు నిర్మలా సీతారామన్ మొత్తం 7 బడ్జెట్లను ప్రవేశపెట్టడం జరిగింది. ఈ నెల 1వ తేదీన ఆమె ఎనిమిదో బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారనే సంగతి తెలిసిందే. మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ గతంలో ఏకంగా 10 బడ్జెట్లను ప్రవేశపెట్టిన ఘనతను సొంతం చెప్పనున్నారు.
 
ఇక 9 బడ్జెట్లతో మాజీ మంత్రి చిదంబరం రెండో స్థానంలో ఉన్నారు. ఆ తర్వాత నిర్మలమ్మ మూడో స్థానంలోకి చేరి ప్రణబ్ ముఖర్జీ రికార్డును నిర్మలా సీతారామన్ సమం చేసుకోనున్నారు. నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రిగా పలు విప్లవాత్మక నిర్ణయాలను తీసుకోవడం ద్వారా వార్తల్లో నిలిచారు. తొలి పద్దులో ఆమె పారిశ్రామిక రంగానికి సంబంధించిన పన్నులలో కీలక సంస్కరణలను తీసుకొచ్చారు.
 
కార్పొరేట్ పన్ను రేట్లను తగ్గించడం ఆమెకు ఎంతగానో ప్లస్ అయింది. 2020 సంవత్సరంలో ఆమె కొత్త ఆదాయపు పన్ను విధానాన్ని ప్రకటించడం జరిగింది. ఈ విధానం ద్వారా ఆమె ఆర్థిక వ్యవస్థ వృద్ధికి బాటలు పరిచారు. నిర్మలా సీతారామన్ ప్రధానంగా స్టార్టప్స్, సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమలపై దృష్టి పెట్టి వాటి ద్వారా ప్రయోజనం పొందేలా చేశారని చెప్పవచ్చు.
 
కంపెనీ చట్టంలో ఆమె కీలక సంస్కరణల దిశగా అడుగులు వేశారు. దేశంలో వ్యాపార అనుకూల వాతావరణాన్ని ఆమె ప్రోత్సహించడం గమనార్హం. చిన్నచిన్న ఉల్లంఘనలను నేరాల నుంచి తొలగించారు. కేవలం వృద్ధిపైనే దృష్టిని కేంద్రీకరించేలా చేస్తూ ఆమె తీసుకున్న నిర్ణయాలపై ప్రశంసలు వ్యక్తమయ్యాయి. కొన్ని రకాల వాటిని ఆమె సివిల్ పెనాల్టీతో సరిపెట్టారు. ఆర్థిక మంత్రి  నిర్మలా సీతారామన్ ప్రధానంగా పేద ప్రజలకు మేలు జరిగేలా పలు పథకాలను అమలు చేయడంపై ప్రశంసలు వ్యక్తం కావడం గమనార్హం.




మరింత సమాచారం తెలుసుకోండి: