జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గత కొద్దిరోజులుగా ఎలాంటి సందడి చేయడం లేదు అనే చర్చ ఇప్పుడు ఏపీ అంతటా వినిపిస్తోంది. రిపబ్లిక్ డే సందర్భంగా మాత్రమే ఆయన కనిపించారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ వాయిస్ ఎక్కడ వినిపించలేదు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు హామీలు అమలు కావని చేతులు ఎత్తేసినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గొంతు వినిపించలేదనే విధంగా ఆయన అజ్ఞాతంలో ఉన్నారనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ఒకవైపు పాలన వ్యవహారాలు చూస్తూనే మరొకవైపు సినిమాలు కూడా చేస్తూ ఉన్నారు.


దీంతో పవన్ కళ్యాణ్ సైలెంట్ గా తన సినిమాలు చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. మరి కొంతమంది పవన్ కళ్యాణ్ విదేశీ పర్యటనలో ఉన్నారని ఆయన భార్యతో పాటు పిల్లలను కలిసేందుకు కూడా స్విజర్లాండ్ కి వెళ్ళారని ప్రచారం కూడా ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తోంది. ఈరోజు రేపు ఢిల్లీలో బిజెపి తరఫున శాసనసభ ఎన్నికలలో ప్రచారంలో భాగంగా వెళ్లబోతున్నారనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ని ఇప్పటికే ఎన్నోసార్లు బిజెపి పార్టీ ప్రచారంలో ఉపయోగించుకుంది.


గతంలో మహారాష్ట్ర ఎన్నికలలో ప్రచారంలో భాగంగా పాల్గొన్న పవన్ కళ్యాణ్ అక్కడ బిజెపికి పెద్ద ఎత్తున మద్దతు పలికి సీట్లను కూడా దక్కించుకునేలా చేశారు. ఇప్పుడు అదే సెంటిమెంట్ ని ఢిల్లీలో కూడా అమలు చేయాలని బిజెపి ప్లాన్ చేస్తూ ఉండటం. అయితే ఇప్పటివరకు ఇందుకు సంబంధించి ఎలాంటి అధికారికంగా ప్రకటన కూడా వినపడలేదు.. మరి ప్రజలు సూపర్ సిక్స్ హామీల గురించి అడుగుతారని డిప్యూటీ సీఎం దూరమయ్యారా లేకపోతే పర్సనల్ కారణాలవల్ల దూరం అయ్యారు అనే విషయం తెలియాల్సి ఉంది.


ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ ప్రతి హామీకి కూడా తాను ముందు ఉంటానని చెప్పారు.కానీ ఎన్నికలు అయిపోయి గెలిచిన తర్వాత వాటి గురించి ఎక్కడ మాట్లాడడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: