అయితే ఈ చీరని సైతం పద్మశ్రీ అవార్డు గ్రహీత అయిన దులారీదేవి మంత్రి కానుకగా ఇచ్చారట.. సీతారామన్ ఒక కార్యక్రమం నిమిత్త బీహార్ కి వెళ్ళినప్పుడు ఆమెను కలిసి అక్కడ ముచ్చటించారట. ఆ సమయంలోనే ఆ కళాకారుని తను డిజైన్ చేసినటువంటి ఒక చేనేత చీరను నిర్మలమ్మ గారికి బహుమతిగా ఇచ్చారట. అంతేకాకుండా బడ్జెట్ ప్రవేశపెట్టే వేళ వీటిని ధరించమంటూ ఆ పద్మశ్రీ అవార్డు గ్రహీత అయిన దులారీదేవి కోరిందట. అలా ఆమెకు ఇచ్చిన మాట ప్రకారమే నిర్మలమ్మ చీర ధరించినట్లు తెలుస్తోంది. దులారీదేవి 2021 లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించారు.
2019లో మొదటిసారిగా నిర్మలమ్మ తొలిసారి ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలను చేపట్టింది. అప్పటినుంచి ప్రతి ఏటా కూడా బడ్జెట్ రోజున తాను ధరించే చీరల విషయం గురించి ప్రత్యేకంగా ఉండేలా చూసుకుంటూ ఉంటుంది.. గత ఏడాది ఫిబ్రవరి ఒకటో తేదీన తాత్కాలికంగా బడ్జెట్ ని ప్రవేశపెట్టినప్పుడు కాంతారంగు చీరలు కనిపించారు. అలాగే అయోధ్యలో బాలరాముడు విగ్రహ ప్రతిష్టకు కూడా నీలిరంగు చీరను ధరించారు.
2023లో బ్రౌన్ రంగు కలిగిన ఎరుపు చీరలో కనిపించారు.
2022లో మెరీన్ రంగు చీరను ధరించారు. ఇది ఒడిస్సా ప్రాంతానికి చెందిన చీరట.
2021 లో ఎరుపు గోధుమ రంగు కలిగిన చీరలో కనిపించారు ఇది భూదాన్ పోచంపల్లి చీరగా పిలుస్తారట.
2020లో నీలిరంగు అంచులు ఆకుపచ్చ బంగారు వర్ణంతో కలిగిన చీరలు కనిపించారు.
2019లో మంగళగిరి గులాబీ రంగు చీరను కట్టుకున్నారట..