కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ మరికొద్ది సేపట్లో సరికొత్త రికార్డును క్రియేట్ చేయబోతుంది .. మన భారతదేశ చరిత్రలో ఇప్పటివరకు వరుసగా అత్యధిక సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రిగా ఈమె చరిత్రలో నిలవబోతున్నారు .. ఈ సంవత్సరం నిర్మల సీతారామన్ వరుసగా 8వ‌సారీ ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టబోతుంది .. వరుసగా అత్యధిక సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రిగా అలాగే మహిళగా నిర్మల సీతారామన్ ఇండియన్ చరిత్రలో నిలవబోతున్నారు .. ఇప్పటికే మాజీ ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్ అత్యధిక సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రిగా భారతీయ చరిత్రలో నిలిచారు. ఫిబ్రవరి 28 1959న  మోరార్జీ దేశాయ్  తొలిసారిగా భారత బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.   ఆ తర్వాత 1960, 1961, 1963, 1964ల్లో మరోసారి బడ్జెట్ను ప్రవేశపెట్టారు .. ఆ  తర్వాత 1967లో మధ్యంతర బడ్జెట్, 1968 , 1969 లో పూర్తిస్థాయి బడ్జెట్ను మరోసారి ఆయన ప్రవేశపెట్టారు .. ఇలా మొత్తంగా 10 బడ్జెట్లను మంత్రిగా మొరార్జీ దేశాయ్ పార్లమెంట్లో ప్రవేశపెట్టి రికార్డ్ సృష్టించారు ..


అయితే ఆయన ఆ బడ్జెట్లను వరుసగా ప్రవేశ పెట్టకపోవడంతో ఎక్కువసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రిగా నిలిచారు .. అయితే ఇప్పుడు ప్రస్తుతం నిర్మలా సీతారామన్‌ వరుసగా బడ్జెట్ను సమర్పిస్తూ రికార్డును క్రియేట్ చేశారు. ఇక 2019లో దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెండోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నిర్మల సీతారామన్‌ను భారత మొట్టమొదటి మహిళా ఆర్థిక మంత్రిగా నియమించారు .. అప్పటినుంచి వరుసగా బడ్జెట్ను ఆమె ప్రవేశపెడుతు వచ్చారు.   2019 నుంచి 2024 ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ తో కలిపి నేడు ప్రవేశపెట్టబోయే బడ్జెట్ తో వరుసగా 8వ సారి నిర్మల బడ్జెట్ ప్రవేశపెట్టనుంది .. ఫిబ్రవరి 1.. 2020 నా బడ్జెట్ సమావేశాలు సందర్భంగా కేంద్రమంత్రి నిర్మ‌ల‌ సీతారామన్ రెండు గంటల 40 నిమిషాల పాటు సుదీర్ఘ బడ్జెట్ ప్రసంగం చేసి రికార్డు క్రియేట్ చేసింది.


అలాగే మురాజీ దేశాయ్ తర్వాత ఎక్కువసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రిగా యూపీఏ గవర్నమెంట్లో చిదంబరం నిలిచారు .. చిదంబరం ఆర్థిక మంత్రిగా 9సార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టారు .. దేవే గౌడ ప్రధానమంత్రిగా బాధ్యతలు తీసుకున్న మార్చ్ 19 1996న మొదటిసారి చిదంబరం బడ్జెట్ ను ప్రవేశపెట్టారు .. ఆ తర్వాత 1997 - 2004 నుంచి 2008 మధ్య ఐదు సార్లు.. అదే విధంగా 2013 - 14 సంవత్సరాలలో కలిపి మొత్తంగా 9 సార్లు చిదంబరం బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఇక ఇప్పుడు చిదంబరం తర్వాత ఎక్కువ సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన అధిక మంత్రిగా మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నిలిచారు .. ఆయన ఆర్థిక మంత్రిగా పనిచేసిన సమయంలో 8 సార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టారు .. 1982, 1984 సంవత్సరాల తో పాటు 2009 - 2012 మధ్య కూడా వరుసగా ఐదు సార్లు ఆయన బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ఇక‌ ఇప్పుడు భారతదేశంలో తొలి మహిళ ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ ఏకంగా 8సార్లు వరుగ‌ బడ్జెట్ను ప్రవేశపెట్టిన మహిళగా రికార్డు సృష్టించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: