అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త పన్ను... పన్ను స్లాబ్లులు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. జీరో నుంచి 3 లక్షల రూపాయలు.. సంపాదించే వారికి ఎలాంటి పనులు విధించడం లేదు కేంద్ర ప్రభుత్వం. వాళ్లందర్నీ సామాన్య పేద ప్రజలుగా భావిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది కేంద్ర సర్కారు. అయితే మూడు లక్షల కంటే ఎక్కువ ఆదాయాన్ని అర్జిస్తున్న ప్రజల పైన పన్ను భారం వేస్తోంది.
ఇక కేంద్ర సర్కార్ తీసుకు వచ్చిన టాక్స్ రూల్స్ ప్రకారం... మూడు లక్షల నుంచి ఏడు లక్షల రూపాయల వరకు ఆదాయాన్ని సంపాదించే ప్రతి భారతీయుడు ఐదు శాతం ప్రభుత్వానికి పన్ను కట్టాల్సి ఉంటుంది. ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. అలాగే... 7 లక్షల నుంచి పది లక్షల రూపాయల వరకు సంపాదించేవారు... తమ ఆదాయంలో 10% కేంద్ర ప్రభుత్వానికి టాక్స్ రూపంలో కట్టాలి. అంటే దాదాపు ఒక లక్ష.. పన్ను రూపంలో వెళుతుంది.
ఇక 10 లక్షల నుంచి 12 లక్షలు సంపాదించేవారు.... ఖచ్చితంగా తమ ఆదాయంలో 15%... టాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. ఇక 12 లక్షల నుంచి 15 లక్షలు సంపాదించేవారు కచ్చితంగా 20 శాతం వరకు తమ ఆదాయంలో ప్రభుత్వాలకు చెల్లించాలి. అలాగే 15 లక్షల కంటే పైన ఆదాయం ఉన్నవారు 30% వరకు... టాక్స్ కట్టాలి. అంటే 15 లక్షల... కంటే ఎక్కువ ఆదాయం సంపాదిస్తున్న వారు తమ ఆదాయంలో... కచ్చితంగా 30% టాక్స్ కట్టాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఇక కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త పన్ను...ప్రకారం.. టాక్స్ లు ఎగగొడితే.. కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు అధికారులు.