ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో వార్షిక బడ్జెzHli ప్రవేశపెడుతున్న విషయం తెలిసిందే .. ఈ క్రమంలోనే వరుసగా 7సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టి సరికొత్త రికార్డు  సృష్టించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.  ఇప్పుడు ఏకంగా 8వ‌ సారి భారత బడ్జెట్ను ఈమె ప్రవేశపెట్టింది .. లోకసభలో ఈరోజు నిర్మల ఉదయం 11 గంటల నుంచి బడ్జెట్ను ప్రవేశపెడుతుంది .. అయితే ప్రతిసారి నిర్మల కేటాయించిన కేటాయింపుల గురించే కాదు నిర్మలా సీతారామన్ ధరించిన చీరలపై కూడా అందరికీ ప్రత్యేక ఇంట్రెస్ట్ ఉంటుంది .. ఈమె బడ్జెట్ సమయంలో ప్రత్యేకంగా ఉండే శారీలని ధరిస్తూ అందర్నీ ఆకర్షిస్తుంది .. అలాగే మన భారతీయ సంస్కృతి సంప్రదాయాన్ని హిందుత్వాన్ని ప్రదర్శించేలా ఇమే చీరాలని ఎంచుకుంటుంది .. ఎక్కువగా బడ్జెట్ స‌మ‌యంలో నిర్మల చేనేత చీరల‌ని ఎక్కువ ఇష్టపడతారు .. వాటిని ఎక్కువగా బడ్జెట్ సమయంలో ధరిస్తూ ఉంటారు .. ఇక‌ ఇప్పుడు 2025 బడ్జెట్ లో కూడా చేనేత చీర్లపై తన ఇష్టన్ని మరోసారి ప్రదర్శించారు . బంగారు రంగు వర్ణం అంచుతో ఉన్న క్రీం కలర్ రంగు సారిని నిర్మల ధరించారు.


ఇక బీహార్ లోని మధుబన్ని కలకు సంబంధించిన చిత్రాలు నిర్మల చీర పై ఉన్నాయి .. ఇక దీంతోపాటు ఆమె బడ్జెట్ చీర పై వెంటనే సోషల్ మీడియాలో కూడా హాట్‌ టాపిక్ గా చర్చ మొదలైంది .. 2021లో పద్మశ్రీ అవార్డు అందుకున్న దులారి దేవి ఇచ్చిన చీరని నిర్మల ఇప్పుడు ధరించారని .. గతంలో కూడా నిర్మల సీతారామన్ .. మిథిలా ఆర్ట్ ఇన్‌స్టిట్యూట్‌లో క్రెడిట్ అవుట్‌రీచ్ య‌క్టివిటీ కోసం మధుబనీని సందర్శించారు నిర్మాణ   ఆ సమయంలో దూలారి దేవిని కలవగా ఆమె ఇచ్చిన చీరను ఇప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో ఈమె ధరించినట్టు తెలుస్తుంది. ఇక 2019లో మోడీ ప్రభుత్వం  రెండోసారి అధికారం లోకీ వచ్చిన తర్వాత .. భారతయ చ‌రిత్ర‌లోనే తొలిసారిగా మహిళా ఆర్థిక మంత్రిగా నిర్మల బాధ్యతలు చేపట్టారు అప్పటినుంచి ఇప్పటివరకు ఆమె బడ్జెట్ ప్రవేశ పెడుతూనే ఉన్నారు .. నేడుతో వరుసగా 8వ సారి ఈమె బడ్జెట్ ప్రవేశపెట్టి రికార్డ్ సృష్టించింది .. అయితే నిర్మల బడ్జెట్ సందర్భంగా ఎలాంటి ప్రత్యేక చీరలు ధరించింది అనేది ఇక్కడ చూద్దాం.


ప్రధానంగా 2024 మధ్యంతర బడ్జెట్ సమయంలో హ్యాండ్లూమ్ చిరను ఈమె ఎంచుకున్నారు .. అది తెలుపు రంగు గోల్డ్ మోటిఫ్స్‌తో ఉన్న మెజెంటా బోల్డ్ సిల్క్ చీరగా కనిపించింది. అదేవిధంగా 2024ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమయంలో ఫిబ్రవరి 1 కాంతా చీరలో ఈమె కనిపించారు .. అయోధ్యలో ఆ సమయంలో బాలరాముడు విగ్రహ ప్రతిష్ట నేపథ్యంలో దానికి ప్రత్యేకగా రామ బ్లూ కలర్ చీరను ధరించిన విషయం తెలిసిందే .. అలాగే 2023 బడ్జెట్ సమయంలో రెడ్ కలర్ టెంపుల్ బోర్డుతో ఉన్నటువంటి ప్రకాశవంత ఎరుపు రంగు చీరతో నిర్మల దర్శనమిచ్చారు. అంతకుముందు 2022 బడ్జెట్ సమయంలో మెరూన్ కలర్ చీరను ధరించారు .. ఇక ఇది ఒరిస్సా రాష్ట్రానికి చెందిన చేనేత చీర . ఇక 2021 బడ్జెట్ సమయంలో కూడా రెడ్ , బ్రౌన్ కలర్ కలిసిన భూధాన్ పోచంపల్లి చీరలో నిర్మల అందర్నీ ఆకర్షించారు. అలాగే 2020 బడ్జెట్ లో కూడా నీలం రంగు అంచుతో పసుపు పచ్చ బంగారు వర్ణం కలిగిన చీరలో మెరిసారు. మొట్టమొదటి 2019 బడ్జెట్ సమయంలో మంగళగిరి గులాబీ రంగు చీరలో తన మెట్టినింటి రాష్ట్ర చీరను ధరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: