ఇక అదే విధంగా పండ్లు కూరగాయల ఉత్పత్తికి కొత్త పథకాన్ని మొదలుపెట్టబోతున్నారు. ప్రపంచంలోనే అభివృద్ధి సాధిస్తున్న దేశాలలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ కూడా ఒకటి అని.. వ్యవసాయం, MSME, ఎగుమతులు పెట్టుబడులు ఆరు రంగాల్లో సమూల మార్పులు చేయబోతున్నట్లు కూడా ప్రకటించారు .. అదే విధంగా పీఎం ధన్‌ధాన్య కృషి యోజన పేరుతో మరో కొత్త పథకం మొదలుపెట్టబోతున్నామని .. అలాగే పలు ప్రయోగాత్మకంగా 100 జిల్లాల్లో పీఎం ధన్‌ధాన్య కృషి యోజనను అమలు చేస్తున్నట్లు నిర్మల సీతారామన్ ప్రకటించారు.
అదే విధంగా ఈ పథకం ద్వారా 15 కోట్ల మంది రైతులకు భారీ ప్రయోజనం ఉంటుందని కూడా ఆమె అన్నారు ..దేశం నుంచి వలసలు అరికట్టడంపై ప్రధానంగా దృష్టి పెడుతున్నామని.. అదే విధంగా పప్పు ధాన్యాల కోసం ఆరు సంవత్సరాల ప్రణాళికనీ కూడా ఎంచుకున్నామని మంత్రి నిర్మల బడ్జెట్లో ప్రకటించారు. ఇలా ఈ బడ్జెట్లో రైతులకు కావాల్సిన ఎన్నో అంశాలను నిర్మల ప్రకటించారు. అలాగే దేశంలో వెనుకబడిన జిల్లాల్లో వ్యవసాయానికి ప్రోత్సాహం అందించేందుకు గోదాములు, నీటి పారుదల, రుణ సదుపాయాలు కల్పిస్తున్నాం. అలాగే దేశంలో కొత్తగా 3 యూరియా ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నాం’’.. అని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.