
ఇక దేశంలో 2025-26 నాటికి ఈ కార్మికులు కోటి మంది ఉంటారని నీతి ఆయోగ్ అంచనా వేయగా... 2029-30 కల్లా వారి సంఖ్య 3 కోట్లు దాటుతుందని అంతా అనుకుంటున్నారు. అంతే కాకుండా రైతులకు తక్కువ వడ్డీకే రుణాలిచ్చే కిసాన్ క్రెడిట్ కార్డుల రుణ పరిమితిని రూ. 3 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంచుతున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. ఎంఎస్‌ఎంఈలక వచ్చే ఐదేళ్లలో రూ. 15 లక్షల కోట్లు కేటాయించనున్నట్లు వివరించారు. ఎంఎస్‌ఎంఈలకు ఇచ్చే రుణాలు రూ. 5 కోట్ల నుంచి రూ.10 కోట్లకు పెంచారు. స్టార్టప్‌లకు రుణాలు రూ. 10 కోట్ల నుంచి రూ. 20 కోట్లకు పెంచడం జరిగింది. కాగా ఈ శ్రమ్ పోర్టల్ ద్వారా గిగ్ వర్కర్ల నమోదు అనేది జరుగుతుందని వివరించారు.
అంతేకాకుండా రానున్న రోజుల్లో కేంద్ర ప్రభుత్వం టూరిజం రంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు సన్నాహాలు చేస్తుందని చెప్పారు. ఇందులో భాగంగానే.. దేశ వ్యాప్తంగా 50 టూరిస్ట్ ప్లేస్‌లను ప్రత్యేకంగా అభివృద్ధి చేయడానికి రూట్ మ్యాప్స్ సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు. ఇందుకు రాష్ట్రాల ప్రభుత్వాలతో కలిసి కేంద్రం పని చేయబోతోంది. ఆయా టూరిస్ట్ ప్రాంతాల్లో టూరిస్టులకు అవసరమైన అన్ని రకాల సదుపాయాలూ కల్పిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. భారీ ఎత్తున హోటళ్లను ఏర్పాటు చేస్తామని కూడా అన్నారు.