కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ కాసేపటి క్రితమే బడ్జెట్ ప్రవేశపెట్టారు. లోక్సభలో నిర్మల సీతారామన్... బడ్జెట్ ప్రవేశ పెట్టడం జరిగింది. అయితే ఈ సందర్భంగా... పలు కీలక ప్రకటనలు చేశారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్. 50 ఏళ్లకు వడ్డీ రహిత రుణాలు అంటూ సంచలన ప్రకటన చేశారు నిర్మలా సీతారామన్‌. కేంద్ర ప్రభుత్వం దేశంలోని రాష్ట్రాల అభివృద్ధి లక్ష్యంగా మూలధన వ్యయాల కోసం రాష్ట్రాలకు లక్షా 50 వేల కోట్ల రూపాయల రుణాలను ప్రకటించారు. 


50 సంవత్సరాలకు వడ్డీ రహిత రుణాలను కేంద్రం ప్రకటించడం గమనార్హం. అదే సమయంలో సంస్కరణలు అమలు చేస్తే ప్రోత్సాహకాలు ఇస్తామని వెల్లడించారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్.  బీహార్‌లో గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్ట్ ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు ప్రకటించారు నిర్మలా.  రూ. లక్ష కోట్లతో అర్బన్‌ ఛాలెంజ్‌ ఫండ్‌ పెడుతున్నట్లు క్లారిటీ ఇచ్చారు. ఇక ఇండియాలోని ప్రముఖ నగరాలకు గ్రోత్‌ హబ్స్‌గా మార్చేందుకు నిధులు కేటాయిస్తున్నట్లు కూడా వెల్లడించారు.


రూ.25 వేల కోట్లతో మేరీటైమ్‌ అభివృద్ధి ఫండ్‌ తీసుకువస్తున్నట్లు ప్రకటన చేశారు. విద్యుత్‌ రంగంలో సంస్కరణలకు పెద్దపీట వేస్తున్నట్లు ప్రకటించారు.. విద్యుత్‌ సంస్కరణలు అమలు చేసే రాష్ట్రాలకు ప్రోత్సాహకాలు చేపడుతున్నామన్నారు.  సంస్కరణలు అమలు చేస్తే GSDPలో 0.5 శాతం అదనపు రుణాలు అందుతాయన్నారు నిర్మలా సీతారామన్‌.  అటు ప్రధాన మంత్రి ధన్ ధాన్య యోజన కార్యక్రమాన్ని ప్రకటించారు నిర్మలా సీతారామన్.


ఈ పథకంతో దేశంలో వెనుకబడిన జిల్లాల్లో వ్యవసాయానికి ప్రోత్సాహం అందనుంది.  ప్రధాన మంత్రి ధన్ ధాన్య యోజనతో 1.7 కోట్ల గ్రామీణ రైతులకు లబ్ది చేకూరుతుంది.  పప్పు ధాన్యాల ఉత్పత్తికి స్వయం సమృద్ధి పథకం తీసుకువస్తున్నట్లు వెల్లడించారు. కంది, మినుములు, మసూర్ లను కొనుగోలు చేయనుంది కేంద్రం.  పండ్లు, కూరగాయల ఉత్పత్తికి నూతన పథకం తీసుకువస్తున్నట్లు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: