కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడల్లా  రైతుల కోసం ఏదో ఒక కొత్త పథకాన్ని తీసుకు వస్తోంది.. ఏదో ఒక రకంగా రైతులకు మేలు కలిగే విధంగా చేస్తుంది. ఇదే తరుణంలో  తాజాగా కేంద్ర సర్కార్ ప్రవేశపెట్టిన బడ్జెట్ లో రైతుల కోసం మరో అద్భుతమైన పథకాన్ని తీసుకు వచ్చింది. ఇదే తరుణంలో రైతుల కోసం ప్రధానమంత్రి ధన్ ధాన్య యోజన అనే పేరుతో  నూతన పథకాన్ని ప్రారంభించింది ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఈ పథకం ద్వారా  వెనుకబడిన రైతాంగానికి ఎంతో ప్రోత్సాహం అందబోతోంది. ఈ ఒక్క పథకం ద్వారానే దాదాపుగా కోటి 70 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనున్నట్లు సమాచారం.


 ముఖ్యంగా పేద, మధ్యతరగతి రైతుల ఆదాయాన్ని పెంచేందుకే ఈ పథకాన్ని ప్రారంభం చేశారని కేంద్ర మంత్రి నిర్మల ప్రకటించారు. ఈ పథకం ద్వారా నీటిపారుదల, గోదాములు,రుణ సౌకర్య కల్పన అందించనుంది. ముఖ్యంగా ఈ పథకం పైలెట్ ప్రాజెక్టులో భాగంగా దేశవ్యాప్తంగా వంద జిల్లాలను ఎంపిక చేసి వ్యవసాయంలో పద్ధతులు అమలు చేయబోతున్నారు. అంతేకాకుండా వ్యవసాయంలో కొత్త కొత్త మెలకువలను ఆవిష్కరించడానికి, అవసరమైన పరిశోధనలు చేసేందుకు రీసెర్చ్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ తో  ఈ బడ్జెట్ ప్రవేశపెట్టారు.. ఎలాంటి వాతావరణంలో అయినా పంటలు ఏపుగా పెరిగి అధిక దిగుబడి వచ్చేలా నూతన వంగడాలను తయారు చేయడం కోసమే ఈ పథకం యొక్క లక్ష్యమని అన్నారు.  ఇందులో విత్తన నమోదు కోసం కూడా ఒకే దేశం ఒకే లైసెన్స్ విధానాన్ని  తీసుకురాబోతున్నారు. దీని ద్వారా రైతులకు ఎక్కడైనా విత్తనాలు ఒకే రేటుకు నాణ్యమైనవి లభిస్తాయి. అంతే కాకుండా సకాలంలో రైతులకు విత్తనాలు కూడా లభిస్తాయి.  అంతేకాకుండా ఈ బడ్జెట్ ద్వారా వ్యవసాయ పెట్టుబడులకు జీఎస్టీ ఫ్రేమ్ వర్క్ సరళతరం చేయడం , రైతులకు ఉపయోగపడే నిత్యవసర వస్తువులను చౌకగా అందించడం కోసమే ఈ పథకాన్ని ప్రారంభించారని నిర్మలా తెలియజేశారు. ఏది ఏమైనా రైతులు పొలాల్లో వాడే పనిముట్లపై కూడా  50 నుంచి 90% సబ్సిడీ అందిచ్చేందుకే  ఈ పథకం పనిచేస్తుందని  నిర్మలా సీతారామన్ తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: