సామాన్య ఉద్యోగస్తులకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే భారత చెప్పింది. పన్ను స్లాబ్ లపై నిర్మల సీతారామన్ తాజాగా కీలక ప్రకటన చేశారు. ముఖ్యంగా మధ్యతరగతి ఉద్యోగులకు రిలీఫ్ దక్కేలా కీలక ప్రకటన చేయడం జరిగింది. మధ్యతరగతి ఉద్యోగుల ఆదాయం 12 లక్షల వరకు ఉన్నా కూడా ఆదాయ పన్ను కట్టాల్సిన పనిలేదని... వారికి మినహాయింపులు ఇస్తున్నట్లు నిర్మల సీతారామన్ తాజాగా బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. స్టాండర్డ్ డిడక్షన్ ను సైతం కలుపుకొంటే 12 లక్షల 75 వేల రూపాయల వరకు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.


కాసేపటికి  క్రితమే నిర్మల సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా 12 లక్షల ఆదాయం ఉన్న మధ్య తరగతి ఉద్యోగులకు ఆదాయపన్ను మినహాయింపు ఇస్తున్నట్లు వెల్లడించారు. నిర్మల సీతారామన్ చేసిన ఈ ప్రకటనతో... మధ్యతరగతి ఉద్యోగులకు 80 వేల రూపాయల ఆదా కాబోతోంది. ఇతర ఆదాయ పన్ను స్లాబులలో మార్పులు కూడా చేస్తున్నట్లు వెల్లడించారు. ఇక 25 లక్షల ఆదాయం ఉన్నవారికి 1,10,000 ఆదాయం ఉండనుందని తెలిపారు.

ఇక కేంద్ర తీసుకువచ్చిన కొత్త ఆదాయ పన్ను స్లాబ్  ప్రకారం.... సున్నా నుంచి నాలుగు లక్షల వరకు సంపాదించే ఉద్యోగులు.. ఒక రూపాయి కూడా టాక్స్ కట్టనవసరం లేదు. అలాగే నాలుగు లక్షల నుంచి 8 లక్షలు సంపాదించే మధ్యతరగతి ఉద్యోగులు ఐదు శాతం టాక్స్లు కట్టవచ్చని.. నిర్మల సీతారామన్ ప్రకటించారు. ఇక 8 లక్షలు నుంచి 12 లక్షల ఆదాయం ఉన్నవారు 10% వరకు టాక్స్లు కట్టాల్సి ఉంటుంది.  


12 లక్షల నుంచి... 16 లక్షల వరకు ఆదాయం ఉన్నవారు 15% టాక్స్లు కట్టాలి. అలాగే 16 లక్షల నుంచి 20 లక్షల వరకు ఆదాయం ఉన్నవారు 20% టాక్స్ లు కట్టాల్సి ఉంటుంది. ఇక 20 లక్షల నుంచి 24 లక్షల వరకు 25% టాక్స్ కట్టాలి. 24 లక్షలకు పైగా సంపాదన ఉన్నవారు 30% టాక్స్ కట్టాల్సి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: