ఇక ఈనెల 12న రాష్ట్రపతి భవన్ వేదిక అంగరంగ వైభవంగా జరగనున్న పెళ్లి వేడుకలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు వ్యక్తిగత భద్రత అధికారిగా పనిచేస్తున్న పూనమ్ గుప్తా .. తన సహచరుడు సీఆర్ పీఎఫ్ లో అసిస్టెంట్ కమాండర్ గా వర్క్ చేస్తున్న అవనీశ్ కుమార్ ను పెళ్లి చేసుకోబోతున్నారు .. ఇక నిజానికి పూనమ్ గుప్తా కూడా సీఆర్ పీఎఫ్ లో అసిస్టెంట్ కమాండర్ గా పనిచేస్తున్నారు .. అయితే రాష్ట్రపతి ముర్ముకు వ్యక్తిగత భద్రత అధికారిగా డిప్యూటేషన్ పై వర్క్ చేస్తున్నారు .. ఇలా వధువరులు ఇద్దరు సీఆర్ పీఎఫ్ అధికారులే .. ఈ కారణంగానే వీరి వివాహ వేదికకు రాష్ట్రపతి భవన్ అంగరంగ వైభవంగా నిలవబోతుందని తెలుస్తుంది.
ఇక్కడ వాస్తవానికి రాష్ట్రపతి భవన్లో ఇప్పటివరకు ఎలాంటి ప్రైవేట్ కార్యక్రమం కూడా జరగలేదు .. ఎందరో రాష్ట్రపతులు ఎందరో ప్రధానులు మారినా కూడా అందరూ రాష్ట్రపతి భవన్ ప్రతిష్టతను కాపాడుతూనే వచ్చారు .. అయితే ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్న ఇద్దరూ దేశ రక్షణలో కీలక భూమిక పోషిస్తున్నసీఆర్ పీఎఫ్ జవానులు కావటం వారిలో ఒకరు రాష్ట్రపతి ముర్ముకు పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్గా వర్క్ చేస్తున్న కారణంగా రాష్ట్రపతి భవన్ ను వీరి పెళ్లి వేడుకకు అంగరంగ వైభవంగా వేదికగా నిలుస్తుంది .. రాష్ట్రపతి భవన్ లోని మదర్ థెరిస్సా క్రౌన్ కాంప్లెక్స్ లో పెళ్లి వేడుక ఎంతో ఘనంగా జరగనుంది.