కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు లోక్ సభ లో 2025-26 ఆర్ధికా సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ని ప్రవేశ పెట్టింది.దేశంలో మూడోసారి ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరాక వస్తున్న పూర్తి స్థాయి బడ్జెట్ కావడంతో సామాన్య మధ్యతరగతి ప్రజలంతా ఈ బడ్జెట్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు..నేడు ఉదయం 11 గంటలకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగాన్నీ మొదలు పెట్టారు.. అయితే బడ్జెట్ సెషన్ మొదలైన కొద్ది సేపటికే ప్రతి పక్షాలు కుంభమేళాలో జరిగిన తొక్కిసలాట దుర్ఘటన పై చర్చ జరపాలని పట్టుబట్టాయి.అయినా కూడా విపక్షాల ఆందోళన మధ్యే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.
దీనితో బడ్జెట్ ప్రసంగాన్ని లోక్‌సభలో ప్రతిపక్షాలు వాకౌట్ చేశాయి.ఎన్డియే ప్రభుత్వం ఎర్పిడిన ఇన్నేళ్లలో దేశం లో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చినట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు.అధిక వృద్ధి రేటు గల దేశాల జాబితాలో భారత్ ను నిలిపేందుకు ఎన్డియే ప్రభుత్వం ఎంతో కృషి చేసినట్లు ఆమె తెలిపారు.. తాజాగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ లో అన్ని వర్గాల వారికీ సమాన ప్రాధాన్యత ని ఇస్తూ కేటాయింపులు జరిపినట్లు ఆమె తెలిపారు.. తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్ లో కేంద్రం కీలక అంశాలకు ప్రాధన్యతను ఇచ్చింది..
ఆదాయ పన్ను మినహాయింపు రూ. 12లక్షలకు పెంపు,కిసాన్ క్రెడిట్ కార్డ్ ఋణం రూ. 5 లక్షలకు పెంపు అలాగే దేశంలో మరో 75 వేల మెడికల్ సీట్లు,రానున్న పదేళ్లలో 100 ఎయిర్ పోర్ట్ ల నిర్మాణం వంటివి హైలైట్ గా నిలిచాయి.. ఇదిలా ఉంటే షెడ్యూల్డ్ కులాలు, తెగలకు చెందిన మహిళల కోసం టర్మ్ లోన్ పధకాన్ని నిర్మలా సీతారామన్ ప్రకటించారు..తొలిసారి సొంత వ్యాపారాలను ప్రారంభించే వారి కోసం, అలాగే ఇప్పటికే వున్నవాటిని విస్తరించే మహిళలకు ఈ పధకం కింద వచ్చే ఐదేళ్ళల్లో రూ. 2 కోట్ల వరకు రుణాలు అందించనున్నట్లు తెలిపారు..