ఈ రోజున కేంద్ర ప్రభుత్వం 2025-2026 కీ సంబంధించి బడ్జెట్ ని సైతం ప్రవేశపెట్టింది. నిర్మల సీతారామన్ అందుకు సంబంధించిన అన్ని విషయాలను ప్రకటించారు. ఇప్పటికే రైతులకు, మహిళలకు ,ఉద్యోగులకు, వ్యవసాయదారులకు ఒక్కొక్క గుడ్ న్యూస్ తెలియజేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు తాజాగా ఆదాయ పన్ను శ్లాబ్ పరిమితిని పెంచబోతున్నట్లు తెలియజేసింది. ఇక మీదట 12 లక్షల రూపాయల వరకు పన్ను ఉండదంటూ తెలియజేశారు. ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఇది అమలులోకి రాబోతున్నట్లు వెల్లడించారు నిర్మల సీతారామన్.


కొత్త ఆదాయపన్ను బిల్లును సైతం అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా ఇలా అందుబాటులో ఉంటుందని తెలిపారు..

0-4 లక్షల వరకు నో టాక్స్..
4-8 లక్షల వరకు అయిదు శాతం .
8-12 లక్షల వరకు 10 శాతం .
12-16 లక్షల వరకు 15%
16-20 లక్షల వరకు 20 శాతం.
20-24 లక్షల వరకు 25 శాతం.
24 లక్షలకు పైగా 30 శాతం బ్యాక్స్  ఉండబోతుందట.


అయితే ఇలా సవరించినటువంటి ఈ శ్లాబ్ ప్రకారం నాలుగు లక్షల రూపాయల వరకు ఆదాయం పైన ఎలాంటి పనులు ఉండదని నాలుగు నుంచి 8 లక్షల వరకు ఆదాయం ఉన్నవారు ఐదు శాతం పన్ను కట్టాల్సి ఉంటుందట.. అలాగే ఎనిమిది నుంచి 12 లక్షల మధ్య ఆదాయం ఉన్నవారు 10% వరకు కట్టాల్సి ఉంటుందట. 12 లక్షల నుంచి 16 లక్షల మధ్య ఆదాయం ఉన్నటువంటి వారు 15% కట్టాల్సి ఉంటుందట. 16 నుంచి 20 లక్షల మధ్య ఆదాయం ఉన్నవారు 20% అలాగే 20 లక్షల నుంచి 24 లక్షల మధ్య ఉన్నవారు 25%.. 24 లక్షల పైబడిన వారు 30 శాతం వరకు పన్ను కట్టాలంటూ కేంద్ర ఆర్థిక మంత్రి ఇటీవల వెల్లడించారు


ఇవన్నీ కూడా మధ్యతరగతి పై పన్ను భారాన్ని సైతం తగ్గించడానికి ప్రజలు ఆర్థికంగా ఎదగడానికి ఉపయోగపడతాయని తెలిపారు సీతారామన్.

మరింత సమాచారం తెలుసుకోండి: