బీమా రంగంలో ఎఫ్.డీ.ఐని 100 శాతానికి పెంచుతున్నట్టు ప్రకటన చేశారు. వచ్చే వారం ఇన్ కమ్ ట్యాక్స్ బిల్లు గురించి ప్రకటన రానుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ కు 3295 కోట్ల రూపాయలు ఇవ్వనున్నట్టు కేంద్రం వెల్లడించింది. విశాఖ పోర్టుకు కేంద్రం 730 కోట్ల రూపాయలు ప్రకటించింది. పోలవరం ప్రాజెక్ట్ కు 5936 కోట్ల రూపాయలు కేటాయించడం గమనార్హం.
పోలవరం నిర్మాణానికి బ్యాలెన్స్ గ్రాంట్ గా 12,157 కోట్ల రూపాయలు ప్రకటించింది. గిగ్ వర్కర్లకు కేంద్రం ఆరోగ్య బీమా ప్రకటించగా కిసాన్ క్రెడిట్ కార్డుల పరిమితిని 3 లక్షల రూపాయల నుంచి 5 లక్షల రూపాయలకు పెంచుతున్నట్టు ప్రకటించింది. ఈ బడ్జెట్ 140 కోట్ల ప్రజల ఆశలను నెరవేర్చే బడ్జెట్ అని మోదీ చెప్పారు. ఇది పేదల బడ్జెట్ అని హరియాణా సీఎం ప్రకటన చేయడం గమనార్హం.
అయితే బడ్జెట్ ఆశాజనకంగా లేదనే విమర్శలు సైతం వ్యక్తమవుతున్నాయి. ఉద్యోగాలు ఉంటే కదా ఆదాయపు పన్ను లబ్ధి పొందడానికి అని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ విమర్శలు చేయడం గమనార్హం. బడ్జెట్ లో కేంద్రం రైతులకు వరాల జల్లు కురిపించిందనే చెప్పాలి. కేంద్ర బడ్జెట్ గురించి ఎక్కువమంది ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తుండటం గమనార్హం. మాల్దీవులకు సైతం బడ్జెట్ లో కేటాయింపులను పెంచారు. కేంద్ర ప్రభుత్వం బంగారం విషయంలో ఎలాంటి సడలింపులు ఇవ్వకపోవడం హాట్ టాపిక్ అవుతోంది.