కేంద్ర ఆర్థిక మంత్రి అయినటువంటి నిర్మలా సీతారామన్ 8వ సారి నేడు(ఫిబ్రవరి 1న) దేశ బడ్జెట్ - 25ను ప్రవేశ పెట్టడం జరిగింది. ఈ క్రమంలోనే బడ్జెట్ విషయమై చాలామందికి అనేక రకాలు సందేహాలు మెదడులో మెదులుతూ ఉంటాయి. మొట్టమొదటి కేంద్ర బడ్జెట్ ఎప్పుడు ప్రవేశ పెట్టడడం జరిగింది, ఎలాంటి పరిస్థితుల్లో ప్రవేశ పెట్టారు? అసలు అంత బడ్జెట్ కి ఎక్కడినుండి నిధులు సేకరిస్తారు అని! ఇపుడు ఆయా విషయాలకు సమాధానం తెలుసుకొనే ప్రయత్నం చేద్దాము.

భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తరువాత మొట్ట మొదటి కేంద్ర బడ్జెట్, అప్పటి అప్పటి ఆర్థిక మంత్రి అయినటువంటి ఆర్.కె. షణ్ముగం చెట్టి నవంబర్ 26, 1947న ప్రవేశ పెట్టడం జరిగింది. అయితే ఈ బడ్జెట్ అంత తేలికగా ప్రవేశపెట్టడం జరగలేదు. దేశ విభజన, అల్లర్ల మధ్య ఈ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టడం జరిగింది. ఇక మనలో చాలామందికి బడ్జెట్ ఎక్కడ మొదలైంది, మొట్ట మొదటి బడ్జెట్ ఏ దేశంలో ప్రవేశపెట్టారో అని తెలిసుకోవాలనుంటుంది కదా.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 112 ప్రకారం చూసుకున్నట్టయితే, కేంద్ర బడ్జెట్ దేశ వార్షిక ఆర్థిక నివేదిక అని చెప్పుకోవచ్చు. ఇది ఒక నిర్దిష్ట సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ ఆదాయం, ఖర్చుల అంచనా. ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు ఉంటుందనే సంగతి విదితమే. ఇక మొట్ట మొదటి బడ్జెట్ అనేది
భారతదేశంలో స్వాతంత్య్రానికి ముందే ఉంది. బ్రిటిష్ కాలంలో మొదటిసారిగా ఏప్రిల్ 7, 1860న దేశంలో అప్పటి ఆర్థిక సభ్యుడు జేమ్స్ విల్సన్ ప్రవేశ పెట్టారు. 1955-56 నుంచి దేశంలో బడ్జెట్ పత్రాలు హిందీలో కూడా రావడం మొదలైంది.

అయితే ప్రపంచంలో మొట్ట మొదటి బడ్జెట్ ఇంగ్లాండ్‌లో ప్రవేశ పెట్టడం జరిగింది. 1760లో ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో బడ్జెట్‌ను ప్రవేశ పెట్టడం స్టార్ట్ అయింది. ఆ తర్వాత ప్రపంచ దేశాలకు వ్యాపించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్‌లో పన్ను చెల్లింపుదారులు, పరిశ్రమ వర్గాలు, మధ్యతరగతి ప్రజలు లాభ పడ్డారని చెప్పుకోవచ్చు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా 8వ సారి బడ్జెట్ ప్రవేశ పెట్టారు. అయితే అన్ని లక్షల కోట్ల బడ్జెట్ కేంద్రానికి ఎక్కడినుండి వస్తుంది అనే అనుమానం చాలామందికి వస్తూ ఉంటుంది? కేంద్ర ప్రభుత్వం అప్పులు చేయడం ద్వారా 24%, ఇన్కమ్ టాక్స్ ద్వారా 22%, జియస్టీ ద్వారా 18%, కార్పొరేషన్ టాక్స్ ద్వారా 17%, పన్నేతర ఆదాయం 9%, ఎక్సయిజ్ పన్ను 5%, కస్టమ్ పన్ను 4%, మరియు రుణేతర పెట్టుబడులు 1% ద్వారా ఆదాయాన్ని సేకరించి బడ్జెట్ ప్రవేశపెడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: