ఏ విశ్వవ్విద్యాలయంలో నైనా మంచి చదువు మంచి వసతులు ఉన్నట్లయితే వాటికి మంచి గుర్తింపు వస్తూ ఉంటుంది. ఇక మంచి గుర్తింపు ఉన్న విశ్వవిద్యాలయాల్లోనే చదువుకోవడానికి విద్యార్థులు అత్యంత ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. ఇకపోతే తాజాగా ఓ విశ్వవిద్యాలయ తమ విశ్వవిద్యాలయానికి ఏ + + గుర్తింపు పొందడం కోసం న్యాక్ బృందానికి లంచాలను ఇచ్చారు. లంచాలను ఇవ్వడం మాత్రమే కాకుండా సి బి ఐ కి పట్టుపడ్డారు. గుంటూరు జిల్లా , వడ్డేశ్వరం లోని కే ఎల్ విశ్వవిద్యాలయానికి ఏ + + గుర్తింపు పొందడానికి ఈ విశ్వవిద్యాలయ యాజమాన్యం న్యాక్ బృందానికి లంచాలను ఇచ్చారు.

ఇక ఈ విషయం సి బి ఐ వారికి తెలియడంతో వారు విశ్వవిద్యాలయ యాజమాన్యంపై మరియు బృందం సభ్యులపై కేసును నమోదు చేశారు. మొత్తంగా ఈ విషయంపై సి బి ఐ బృందం వారు 14 మందిపై కేసును నమోదు చేసినట్లు తెలుస్తోంది. కొనరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్ ఫౌండేషన్ కే ఎల్ ఈ ఎఫ్ ప్రెసిడెంట్ మరియు ఇతర ప్రతినిధులతో పాటు న్యాక్ తనిఖీ బృందంలోని పది మందిని నిందితులుగా సి బి ఐ బృందం వారు చేర్చినట్లు తెలుస్తోంది.

ఇక ఇందులో దేశంలోని అత్యంత ప్రసిద్ధిగాంచిన విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లు ఉండడం అందరినీ షాక్ కి గురి చేసింది. న్యాక్ బృందాలు వడ్డేశ్వరంలో మూడు రోజులుగా కేఎల్ యు యూనివర్సిటీ ప్రమాణాలను పరిశీలిస్తుంది. ఇక యూనివర్సిటీ యాజమాన్యం ఏ + + గుర్తింపు కోసం న్యాక్ బృందాలకు బంగారం , నగదు , ల్యాప్టాప్ లు , సెల్ ఫోన్లు వంటి బహుమతులను ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక సి బి ఐ వారు 37 లక్షల నగదు , 6 ల్యాప్టాప్ లను , ఒక ఐఫోన్ 16 ప్రో ను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: