ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు రోజురోజుకు మారిపోతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని ఆసక్తి నెలకొంది. అయితే ఇలాంటి నేపథ్యంలో వైసిపి మాజీ నాయకులు విజయ సాయి రెడ్డి పెను సంచలనానికి దారి తీశారు. ఆయన రాజకీయాలకు దూరమైన సంగతి మన అందరికీ తెలిసిందే. విజయసాయిరెడ్డి రాజకీయాలకు దూరమవుతున్నట్లు ప్రకటించిన తర్వాత... నిత్యం వార్తలో నిలుస్తున్నారు. ఏదో ఒక విషయంలో...  విజయసాయిరెడ్డి పేరు మాత్రం... వైరల్ అవుతూనే ఉంది.


అయితే తాజాగా విజయసాయిరెడ్డి గురించి మరో కొత్త విషయం తెరపైకి వచ్చింది. ఆయన త్వరలోనే కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోబోతున్నారని సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల ను... విజయ
 సాయి రెడ్డి కలిసినట్లు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది ఒక వార్త. హైదరాబాదులో ఉన్న వైఎస్ షర్మిలను... ఆమె ఇల్లు అయిన లోటస్ పాండ్ లో కలిశారట విజయసాయిరెడ్డి.


ఏపీలో వైసిపి పార్టీ ఓడిపోయిన తర్వాత ఎక్కువ శాతం హైదరాబాదులోనే తిరుగుతున్నారు విజయసాయిరెడ్డి. అయితే రాజకీయాలకు గుడ్ బై చెప్పిన విజయసాయిరెడ్డి వ్యవసాయం చేసుకుంటానని చెప్పి.... రెండు రోజుల కిందట వైయస్ షర్మిలను కలిశారట. దాదాపు మూడు గంటలపాటు వైయస్ షర్మిల తో రాజకీయాలపై చర్చించారట విజయసాయిరెడ్డి. అయితే ఈ విషయం... వైయస్ షర్మిల సన్నిహితులు  లీక్ చేసినట్లు తెలుస్తోంది.


అయితే ఈ విషయం బయటికి రావడంతో కాంగ్రెస్ పార్టీలోకి విజయసాయిరెడ్డి వెళ్లబోతున్నారని... అందరూ ప్రచారం చేస్తున్నారు. ఆ పార్టీలోకి వెళ్తే కీలక పదవి ఆయనకు ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇప్పటివరకు విజయసాయిరెడ్డి మాత్రం స్పందించలేదు. రాజకీయాలకు అలాగే రాజ్యసభ పదవికి రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి... వ్యవసాయం చేసుకుంటున్నట్లు తాజాగా ఒక పోస్ట్ కూడా పెట్టారు.   అయితే అటు బిజెపి నుంచి కూడా విజయసాయిరెడ్డికి.. గవర్నర్ పదవి ఆఫర్ వచ్చినట్లు సమాచారం అందుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: