ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. తల్లికి వందనం పథకాన్ని ఎప్పుడు అమలు చేస్తామనే దానిపై క్లారిటీ ఇచ్చారు నారా చంద్రబాబు నాయుడు. మే తరువాత అంటే వచ్చే విద్యా సంవత్సరం నుంచి తల్లికి వందనం... పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించారు చంద్రబాబు నాయుడు. అంటే ఈ ఆర్థిక సంవత్సరం ఈ పథకం అమలు.. కాబోదని చెప్పకనే చెప్పారు నారా చంద్రబాబు నాయుడు.

 

అన్నమయ్య జిల్లా సబ్బే పల్లి మండలంలో... సీఎం చంద్రబాబు నాయుడు ఈ వ్యాఖ్యలు చేయడం.. జరిగింది. ఈ తల్లికి వందనం కార్యక్రమంలో భాగంగా... ఒక విద్యార్థికి 15వేల రూపాయలు ఇస్తామని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం మరో 10 వేల రూపాయలు ఇవ్వనుంది. అయితే ఈ పథకాన్ని వచ్చే సంవత్సరం నుంచి ప్రారంభిస్తామని తెలిపారు. ఎన్నికల కంటే ముందు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15 వేల రూపాయలు ఇస్తామని... హామీ ఇచ్చినట్లు చంద్రబాబు నాయుడు గుర్తు చేశారు.

 

ఎన్నికల కంటే ముందు ఇచ్చిన హామీని కచ్చితంగా అమలు చేస్తామని... ఆ డబ్బులను వీలైనంత తొందరలోనే ఇచ్చేలా ప్రయత్నం చేస్తున్నామని చంద్రబాబు నాయుడు వెల్లడించారు. అయితే ఆ డబ్బులను ఒకసారి ఇవ్వాలా లేదా రెండుసార్లు ఇవ్వాలా.. అనే దానిపై ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు. జూన్ 2వ తేదీన విద్యార్థులు స్కూల్ కు వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి ఆలోపే విద్యార్థులకు అందేలా చూస్తామని తెలిపారు.

 

కచ్చితంగా ఏపీ ప్రజల రుణం తీర్చుకునేలా ఈ పథకాన్ని అమలు చేస్తామని చంద్రబాబు నాయుడు వివరించారు. అలాగే రైతు భరోసా నిధుల పైన కూడా కీలక ప్రకటన చేశారు నారా చంద్రబాబు నాయుడు. కనీసం 20000 ఇచ్చే కార్యక్రమానికి త్వరలోనే శ్రీకారం చుట్టబోతున్నట్లు ప్రకటన చేశారు. ఈ విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఈ 20వేల రూపాయలలో కేంద్రం 6000 ఇస్తే ఏపీ ప్రభుత్వం 14,000 ఇవ్వనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: