ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముఖ్య కారణం సూపర్ సిక్స్ హామీలతో పాటు మరికొన్ని హామీలను చెప్పడంతో గెలిచిందని చెప్పవచ్చు. ఏర్పడి ఎనిమిది నెలలు కావస్తూ ఉన్న ఇంతవరకు ఎలాంటి సంక్షేమాలను కూడా ముందుకు తీసుకువెళ్లలేదు. దీంతో ఇప్పటికే కూటమి ప్రభుత్వం పైన ప్రజలకు చిన్నపాటి అసంతృప్తి కూడా కనిపిస్తూ ఉన్నది. అందుకే వివక్షాలు కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువగా గొంతు లేపి మరి మాట్లాడుతూ ఉన్నారు. అధికారంలోకి వస్తే రెట్టింపు సంక్షేమాలను ఇస్తారన్న చంద్రబాబు తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత రకరకాల కారణాలు చెబుతూ ఉన్నారు.


ఈ విషయం పైన చివరికి కూటమి పార్టీ నేతల పైన చాలా ఒత్తిడి ఎక్కువైందట. సంక్షేమల పథకాల విషయంపై విమర్శలు ఎదురవడంతో చంద్రబాబు వీటిని గుర్తించి అమలు చేస్తామని చెబుతున్నారు. అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం వాటిపైన దృష్టి పెట్టామని తెలిపారు చంద్రబాబు. ఇటీవలే రాష్ట్ర ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నదని పుంజుకున్న తర్వాత అమలు చేస్తామని చేతులెత్తేయడంతో ఇది వివక్షాలకు అస్త్రంగా మారింది. తాజాగా సోషల్ మీడియాలో ఒక వీడియో కూడా వైరల్ గా మారుతోంది.


సీఎం చంద్రబాబు ఒక సమావేశంలో ప్రసంగిస్తూ ఉండగా టిడిపి శ్రేణులలో ఒకరైన ఒక ప్రశ్న వేశారు.. అన్నదాత సుఖీభవ నిధులను ఎప్పుడు విడుదల చేస్తారు అంటూ ప్రశ్నించడంతో చంద్రబాబు అలెర్ట్ అయ్యి త్వరలోనే అంటూ తెలియజేశారు. ఆ తర్వాత ఈ రాష్ట్రానికి ఆదాయం సమకూరిన తర్వాత వేస్తామని సంపద సృష్టించే ఏదైనా మార్గం ఉంటే చెప్పు అంటూ ప్రశ్నించారు. దీన్ని బట్టి చూస్తే సంక్షేమ పథకాలు ఇప్పట్లో అమలు చేసేలా కనిపించడం లేదు. ఈ విషయాన్ని ఇప్పుడు వైసిపి నాయకులు కార్యకర్తలు సైతం వైరల్ గా చేస్తూ ఉండడంతో ప్రజలు కూడా రాబోయే రోజుల్లో ఇలా నిలదీసి అడిగే అవకాశం ఉందనే విధంగా చాలామంది కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: