ఈ సందర్భంగా... సంధ్య థియేటర్ తొక్కి సలాట సంఘటనపై సదరు యాంకర్... ప్రశ్నించడంతో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి. అల్లు అర్జున్ కోసం సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరగలేదని క్లారిటీ ఇచ్చారు కేతిరెడ్డి. రష్మిక మందాన్న నేషనల్ క్రష్ కావడంతో... హైదరాబాదులో ఉన్న ఫ్యాన్స్ అందరూ సంధ్య థియేటర్ వద్ద ఎగబడ్డారని తెలిపారు. ఈ తరుణంలోనే రష్మిక కారణంగా సంధ్య థియేటర్ లో తొక్కిసలాట జరిగిందని... బన్నీ అసలు బాగోడని వివరించారు.
పుష్ప 2 సినిమాలో కూడా గ్లామర్ గా బన్నీ కనిపించలేదని... అందుకే రష్మికను చూసేందుకు జనాలు సంధ్య థియేటర్ కు వచ్చారని తెలిపారు. ఈ తరుణంలోనే అన్యాయంగా ఒక మహిళ మరణించింది అని.. ఆమె కొడుకు ఆసుపత్రిలో ఉన్నాడని ఆవేదన వ్యక్తం చేశారు కేతిరెడ్డి వెంకట రామిరెడ్డి. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ అలాగే బాలయ్య లపై కూడా హాట్ కామెంట్స్ చేశారు కేతిరెడ్డి. సినిమా యాక్టర్లకు సినిమాలు తప్ప రాజకీయాలు పనికిరావు అన్నారు.
పవన్ కళ్యాణ్ పోటీ చేయగా చేయగా గెలిచారన్నారు. హిందూపురం వదిలేసి బయట పోటీ చేస్తే బాలకృష్ణ గెలవడం కష్టమేనని తేల్చి చెప్పారు. హిందూపురం కాబట్టి మూడుసార్లు బాలయ్య గెలిచాడన్నారు. కమల్ హాసన్ కంటే.. పవన్ కళ్యాణ్ పెద్ద నటుడు కాదని బాంబు పేల్చారు. అసలు పవన్ కళ్యాణ్ కు నటనే రాదని.. అతను పెద్ద నటుడు కాదని వివరించారు. అలాగే తాను జనసేన పార్టీలోకి వెళ్ళబోనాన్ని కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి. వైయస్ జగన్మోహన్ రెడ్డి తో తన ప్రయాణం ఉంటుందన్నారు.