టాలీవుడ్‌ కు చెందిన హీరోయిన్‌ రష్మిక మందన గురించి తెలియని వారంటూ ఎవరూ లేరు. రష్మిక అంటే ప్రతి ఒక్కరికి ఎంతగానో ఇష్టం. ప్రపంచవ్యాప్తంగా రష్మికకు అభిమానులు ఉన్నారు. చలో సినిమాతో ప్రతి ఒక్కరికి పరిచయమైన రష్మిక మొదటి సినిమాతోనే ఎంతగానో క్రేజ్ దక్కించుకుంది. అనంతరం వరుసగా సినిమాలు చేసుకుంటూ ఎన్నో విజయాలను తన ఖాతాలో వేసుకుంటుంది. రీసెంట్ గా పుష్ప-2 సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.


సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలై భారీగా కలెక్షన్లను రాబట్టింది. కాగా, ఈ సినిమా అనంతరం రష్మిక వరుస సినిమాలతో బిజీగా ఉంది. చేతినిండా సినిమాలతో రష్మిక బిజీగా గడుపుతోంది. కాగా, రష్మిక గతంలోనే కన్నడ హీరో రక్షిత్ శెట్టితో గాడమైన ప్రేమలో మునిగిపోయింది. కొంతకాలం పాటు వీరిద్దరూ ప్రేమించుకున్నారు. అనంతరం కుటుంబ సభ్యుల అంగీకారంతో ఎంగేజ్మెంట్ కూడా జరుపుకున్నారు. ఆ తర్వాత ఏమైందో తెలియదు వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారు.


ఆ తర్వాత రష్మిక వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతోంది. కాగా, టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండతో రిలేషన్ కొనసాగిస్తుందంటూ ఎన్నో రోజుల నుంచి వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే ఈ వార్తలపై రష్మిక, విజయ్ దేవరకొండ చాలా కాలం నుంచి అసలు స్పందించడం లేదు. కానీ వీరిద్దరికి సంబంధించిన ఫోటోలు ఎప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి.


ఇటీవలే కొద్ది రోజుల క్రితం ఓ రెస్టారెంట్ లో వీరిద్దరూ కలిసి కనిపించడంతో వీరి ప్రేమ, డేటింగ్ వార్తలకు తెరపడింది. వీరిద్దరూ నిజంగానే ప్రేమలో ఉన్నారని ప్రతి ఒక్కరూ ఫిక్స్ అయిపోయారు. అంతేకాకుండా రష్మిక కూడా రీసెంట్ గా ఈ విషయం పైన క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ, రష్మిక పీకల్లోతు ప్రేమలో మునిగిపోయి ఉన్నారు. మరి వీరు ఎప్పుడు వివాహం చేసుకుంటారో చూడాలి. ప్రస్తుతం రష్మిక ఫుల్ ఫామ్ తో దూసుకుపోతోంది. విజయ్ దేవరకొండ కూడా తన సినిమాలతో అభిమానులను ఆకట్టుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: