ఒకవైపు నీతి ఆయోగ్ రిపోర్టు పేరుతో నిధుల కొరత అంటూ లొల్లి.. మరోవైపు ఆర్థిక పరిస్థితి గాడిలో పెడుతున్నామని గొప్పలు. ఇది నిజంగా ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడమా లేక ఉన్నదాన్ని సర్వనాశనం చేయడమా గతంలో జీఎస్టీ వసూళ్లు ప్లస్‌లో ఉండేవి.. ఆర్థిక పరిస్థితి పర్ఫెక్ట్‌గా ఉండేది.. కానీ ఇప్పుడు సీన్ రివర్స్. ఏడు నెలల్లో ఒకే ఒక్క నెల ప్లస్‌లో జీఎస్టీ.. మిగతాదంతా మైనస్సే. ఇసుక, మద్యం ఆదాయం సగానికి సగం పడిపోయిందట. మరి అప్పుడు ఆదాయం ఎటు పోయింది? ఇప్పుడు లోటు ఎందుకు వచ్చింది? ఎవరు చేశారు ఈ లోపం?
ఇప్పుడు అసలు చిక్కు సంక్షేమ పథకాల అమలులోనే ఉంది. డబ్బులు లేవని సాకులు చెబుతూ పథకాలను తొక్కి పెడతారా లేక జగన్ వల్లే ఈ పాపమంతా అని ప్రజలను నమ్మిస్తారా ఇస్తే మాత్రం.. జగన్ నాశనం చేసిన ఆర్థిక వ్యవస్థను తాము బాగు చేసి ఇస్తున్నామని బిల్డప్ ఇస్తారా లేకపోతే అసలు పథకాలు ఇవ్వకుండా జగన్ అందుకు కారణం అని చూపిస్తారా, ప్రజలు మాత్రం గమనిస్తూనే ఉన్నారు.
ఇంతకీ చంద్రబాబు నాయుడు అసలు ప్లాన్ ఏంటి అనేది కూడా సీక్రెట్ గానే ఉండిపోయింది. దశల వారీగా పథకాలు అమలు చేస్తారా అంటే ప్రస్తుతం ఎలాంటి క్లారిటీ రాలేదు. ఈ ఏడాది గ్యాస్ బండలు, పెన్షన్ పెంపు ఇచ్చి చేతులు దులుపుకుంటారా తర్వాత రైతులకు, నిరుద్యోగులకు ఒక్కొక్కటిగా ఇస్తారా ఇలా చేస్తే ఏడాదికి 45 నుంచి 65 వేల కోట్లు మిగులుతాయట. జగన్ ఇచ్చిన సంక్షేమానికి అంత ఖర్చు పెట్టారని ఇప్పుడు వీరు డబ్బులు మిగిలిస్తే గొప్పే కదా. ఆ డబ్బులతో అప్పులు తీరుస్తారా లేక మళ్ళీ అవే పథకాలకు మళ్లిస్తారా ఇవన్నీ ప్రశ్నలు ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు అడుగుతున్నారు.
అప్పులు తెచ్చి సంక్షేమానికి ఖర్చు పెడితే తప్పు పడతారు.. అదే అప్పులు తెచ్చి దశల వారీగా పథకాలు ఇస్తే జనం నమ్ముతారా 'ఇచ్చినోడినే ఓడగొట్టారు.. ఇవ్వనోడి గురించి ఏం మాట్లాడతాం' అని ఆర్కే అన్నట్లుగా.. దశల వారీగా ఇస్తున్నా ఎవరూ కాదనరనే ధైర్యంతో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది. జగన్‌ను మర్చిపోయి బాబు చేసేదే కరెక్ట్ అని జనం నమ్మే ఛాన్స్ ఉంటుందట. ఇప్పుడేం ఎన్నికలు లేవు కాబట్టి రిస్క్ తక్కువే అనుకుంటూ అనుకుంటూ ఉండొచ్చు.
ఏది ఏమైనా.. సూపర్ సిక్స్ హామీల వెనుక అసలు కథ మాత్రం ఆసక్తికరంగానే ఉంది. మున్ముందు ఏం జరుగుతుందో చూడాలి.