అయితే విజయసాయిరెడ్డి పొలిటికల్గా గుడ్ బై చెప్పినప్పటి నుంచి.. అందర్నీ ఒక్కొక్కసారి కలుస్తూ ఉన్నారు. పవన్,చంద్రబాబు వంటి వారు తనకు వ్యక్తిగతంగా శత్రువులు కారంటూ కూడా తెలియజేయడం జరిగింది.ఆ తర్వాత చాలా మంది ఎన్నో రకాలుగా కామెంట్స్ చేసినప్పటికీ తాను మాత్రం వ్యవసాయమే చేసుకుంటానంటూ ఇటీవలే పొలంలో ఉన్నటువంటి కొన్ని ఫోటోలను షేర్ చేశారు. ఆ తర్వాత బిజెపిలోకి చేరుతారని వార్తలు వినిపించినప్పటికీ అన్నిటి పైన క్లారిటీ ఇచ్చారు.
తాజాగా తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి కి విజయసాయిరెడ్డి వరుసకు బాబాయి అవుతారట. తారకరత్న, అలేఖ్య ప్రేమించుకొని వివాహం కావడానికి కూడా విజయసాయిరెడ్డి ముఖ్య కారణమని చెప్పవచ్చు. ఒకానొక సందర్భంలో అలేఖ్య అని ఈ విషయాలను కూడా తెలియజేసింది. అయితే పార్టీలకు దూరంగా ఉండటంతో ఇటీవలే అలేఖ్య కుటుంబంతో కలిసి కొంతమేరకు సమయాన్ని విజయసాయిరెడ్డి అలేఖ్య రెడ్డి కుటుంబంతో గడుపుతూ.. వీకెండ్ విత్ విఎన్ఆర్ అంటూ ఒక ఫోటోని సైతం షేర్ చేశారు. అయితే అలేఖ్య రెడ్డి కుటుంబాన్ని చాలా రోజుల నుంచి కలవకపోవడంతో అక్కడికి వెళ్లి మరి కుటుంబంతో మాట్లాడి.. అన్ని విషయాలను తెలుసుకున్నారట. విజయసాయి రెడ్డి మళ్ళీ పొలిటికల్ గా 2029లో ఎంట్రీ ఇస్తారనే విధంగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి పొలిటికల్ గా గుడ్ బై చెప్పేసినప్పటికీ కూడా ఏదో ఒక విషయంలో విజయసాయి రెడ్డి వైరల్ గా మారుతున్నారు.