ఏపీలో కలకలం చోటు చేసుకుంది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ల్యాండ్‌ కబ్జా చేసేందుకు ప్రయత్నాలు చేసారు కొందరు. ఇప్పుడు ఈ సంఘటన ఏపీలో హాట్‌ టాపిక్‌ అయింది. బాపట్లలో టిడిపి కార్యాలయ స్థలం కబ్జా అయినట్లు వార్తలు వస్తున్నాయి. 2000 సంవత్సరంలో పార్టీ కార్యాలయానికి, 9: 50 సెంట్లు స్థలాన్ని విరాళంగా ఇచ్చారు టిడిపి కార్యకర్త మొవ్వ సుబ్బారావు. ఇందులో భాగంగానే.... టిడిపి అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేరుతో రిజిస్ట్రేషన్ చేయించారు మొవ్వ సుబ్బారావు.


బాపట్ల శ్రీనివాస్ నగర్ లో సర్వేనెంబర్ 969-1 లో 9:50 సెంట్లు స్థలం ఉందని చెబుతున్నారు. అయితే... స్థానికంగా టిడిపి పార్టీ అధికారంలో లేకపోవడంతో కార్యాలయ నిర్మాణాన్ని పట్టించుకోలేదు టీడీపీ పార్టీ స్థానిక నాయకత్వం. ఇక ఈ తరునంలోనే...టిడిపి అధినేత,  ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేరుతో రిజిస్ట్రేషన్ అయిన భూమిపై కబ్జాదారుల కన్ను పడింది.   ఖాళీగా ఉన్న స్థలాన్ని , నకిలీ డాక్యుమెంట్లతో వేరొకరి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.


అయితే... 2010లోనే నకిలీ రిజిస్ట్రేషన్ వ్యవహారం వెలుగులోకి వచ్చిందని చెబుతున్నారు. ఇటీవల కూడా టిడిపి అధినేత,  ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేరుతో రిజిస్ట్రేషన్ అయిన స్థలం పై లావాదేవీలు జరిగినట్లుగా ప్రచారం జరుగుతోంది.  తాజాగా టిడిపి కార్యాలయం నిర్మాణం వ్యవహారం చర్చకు రావడం,  బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ దృష్టికి ఈ విషయం రావడంతో దీని వెనక ఉన్న వ్యక్తులపై ఆరా తీశారు. దీంతో అసలు బండారం బయట పడిందట.
 

నక్క సత్తార్ రెడ్డి అనే వ్యక్తి....  ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ల్యాండ్‌ కబ్జా చేసేందుకు ప్రయత్నాలు చేసారట. దీంతో బాపట్ల మండలం కొత్త ఓడరేవుకు చెందిన నక్క సత్తార్ రెడ్డి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు పోలీసులు. ఈ స్థలం విషయంలో దొంగ డాక్యుమెంట్లు పుట్టించిన సత్తార్ రెడ్డికి, నకిలీ డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్ చేయించే  చరిత్ర ఉందంటున్నారు పోలీసులు. ఇక ఈ సంఘటనపై సమగ్ర విచారణలో, పూర్తి విషయాలు వెలుగు చూసే అవకాశం ఉందని చెబుతున్నారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: