గోపీచంద్ సినీ కెరీర్ లో ఇండస్ట్రీ హిట్ కావడానికి అవసరమైన అన్ని లక్షణాలు ఉన్న సినిమా సాహసం కాగా కొన్ని కారణాల వల్ల ఈ సినిమా ఆ రేంజ్ ను అయితే అందుకోలేదనే చెప్పాలి. ఈ సినిమాలో తాప్సీ హీరోయిన్ గా నటించగా బీవీఎస్.ఎన్ ప్రసాద్ ఈ మూవీకి నిర్మాతగా వ్యవహరించారు. లడక్ తదితర ప్రాంతాలలో ఈ సినిమా షూటింగ్ జరగడం కొసమెరుపు.
ఈ సినిమాకు వేర్వేరు విభాగాలలో పలు అవార్డ్స్ సైతం వచ్చాయి. గోపీచంద్ కెరీర్ తొలినాళ్లలోనే భిన్నమైన కథాంశాలకు ఓటు వేయడంతో పాటు బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచే కథాంశాలను ఎంచుకున్నారు. అయితే సరైన ప్రమోషన్స్ లేకపోవడం, ఇతర కారణాలు ఈ సినిమాకు మైనస్ గా నిలిచాయని చెప్పవచ్చు. గోపీచంద్ రెమ్యునరేషన్ ప్రస్తుతం పరిమితంగానే ఉందనే సంగతి తెలిసిందే.
గత కొన్నేళ్లుగా వరుస ఫ్లాపులు పలకరించడం కూడా గోపీచంద్ కు ఒక విధంగా మైనస్ అయిందని చెప్పవచ్చు. సరైన సబ్జెక్ట్ లతో ముందడుగులు వేస్తే బాక్సాఫీస్ వద్ద గోపీచంద్ సంచలనాలను సృష్టించడం మరీ కష్టమేం కాదు. నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే గోపీచంద్ కు పూర్వ వైభవం వస్తుంది. రొటీన్ మాస్ మసాలా కంటెంట్ సినిమాలకు మాత్రం గోపీచంద్ దూరంగా ఉంటే మంచిది. 2025 సంవత్సరం గోపీచంద్ కు కెరీర్ పరంగా కలిసొస్తుందేమో చూడాల్సి ఉంది. గోపీచంద్ కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది.