శ్రీ సత్యసాయి జిల్లాలో కలకలం. నేడు హిందూపురం మున్సిపల్ ఛ్తెర్మన్ ఎన్నిక జరుగనుంది. ఈ తరునంలోనే... క్యాంప్ నుంచి నేరుగా మున్సిపల్ కార్యాలయానికి రానున్నారు టిడిపి కౌన్సిలర్లు. తమ కౌన్సిలర్లను కాపాడుకునే పనిలో వైసీపీ పార్టీ పడింది. అటు హిందూపురం నియోజకవర్గంలోనే మకాం వేశారు టీడీపీ పార్టీ ఎమ్మెల్యే బాలకృష్ణ. అయితే.. ఇలాంటి పరిస్థితులు ఉన్న తరుణంలోనే... పోలీసులు అలర్ట్‌ అయ్యారు.  శ్రీ సత్యసాయి హిందూపూర్ పట్టణంలో 144 సెక్షన్  & సెక్షన్ 30 పోలీస్ ఆక్ట్ అమలు చేస్తున్నట్లు హిందూపురం పోలీస్ సబ్ డివిజన్ ప్రకటన చేసింది. 

హిందుపూరం మున్సిపల్ ఎలక్షన్ నిబంధనలు అందరూ తప్పక పాటించాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది హిందూపురం పోలీస్ సబ్ డివిజన్.
సోమవారం హిందూపురం మున్సిపల్ చైర్పర్సన్ ఎంపిక సందర్భంగా  హిందూపురం పట్టణంలో 144 సెక్షన్ అమలుపరుస్తున్నట్లు తెలిపారు హిందూపురం పోలీస్ సబ్ డివిజన్ పోలీసులు.  మున్సిపల్ కౌన్సిల్ హాల్ నందు మున్సిపల్ కమిషనర్ అనుమతించిన వారు మాత్రమే లోపలికి అనుమతించబడునని వెల్లడించారు.  



హిందూపురం పట్టణంలో  144 సెక్షన్ మరియు సెక్షన్ 30 పోలీస్ ఆక్ట్ అమల్లో ఉన్నందున ప్రజలు ఎవరూ కూడా ఒకచోట గుంపులు గుంపులుగా చేరకూడదన్నారు హిందూపురం పోలీస్ సబ్ డివిజన్ పోలీసులు.   విజయం సాధించిన అనంతరం విజయోత్సవ ర్యాలీలు, డీజే లకు, బాణాసంచా లకు, అనుమతులు లేవని తేల్చి చెప్పారు.  కాగా.. హిందూపురం మున్సిపాల్టీలో మొత్తం వార్డులు 38 ఉన్నాయి. ఎంపీ, ఎమ్మెల్యేలతో కలిసి టీడీపీ , బీజేపీ బలం 10గా ఉంది.  వైసీపీని వీడి టీడీపీలో చేరిన ఛ్తెర్మన్ ఇంద్రజతో పాటు 13 మంది కౌన్సిలర్లు కూడా ఉన్నారు.

దీంతో తెలుగుదేశం పార్టీ మొత్తం బలం 23 కు చేరుకుంది. వైసీపీకి 17 మంది కౌన్సిలర్ల మద్దతు మాత్రమే ఉంది. ఈ తరుణంలోనే గెలుపుపై తెలుగుదేశం పార్టీ ధీమాగా ఉంది. ఇప్పటికే హిందూపురం చేరుకున్న ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ...దగ్గరుండి చూసుకుంటున్నారు. క్యాంపు నుంచి నేరుగా ఎమ్మెల్యే బాలకృష్ణతో కలిసి మున్సిపల్ కార్యాలయం చేరుకోనున్నారు టీడీపీ మద్దతు కౌన్సిలర్లు.

మరింత సమాచారం తెలుసుకోండి: