ఈ మధ్యకాలంలో చాలామంది పోలీసులు సర్వీస్ రివాల్వర్లతో కాల్చుకొని ఆత్మహత్యలు చేసుకోవడం మనం చూస్తూనే ఉన్నాం.. దీనికి కారణాలు ఏంటనేది తెలియదు కానీ తరచూ సంఘటనలు ఎక్కడో ఒక దగ్గర జరుగుతూనే ఉన్నాయి. అయితే తాజాగా తణుకు ఎస్సై ఆత్మహత్య చేసుకోవడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది.. ఇదే తరుణంలో ఆయనకు సంబంధించినటువంటి ఒక ఆడియో కూడా వైరల్ అవుతుంది.. ఆడియోలో ఉన్న దాని ప్రకారం ఆయనను ఎవరో చాలా ఇబ్బంది పెట్టినట్టు తెలుస్తోంది..

ఈ ఆడియోలో ఎస్సై తన స్నేహితుడితో ఆవేదన వ్యక్తం చేస్తూ చాలా బాధపడుతున్నారు.. సంబంధంలేని మ్యాటర్ లో నన్ను ఇరికించారని, ఆ ఇద్దరు చాలా ఇబ్బంది పెడుతున్నారని మాట్లాడారు.. అంతేకాకుండా తన భార్య పిల్లలను తలుచుకుంటూ చాలా బాధపడ్డారు.. అయితే ఈ సంభాషణలో ఎస్సై సత్యనారాయణమూర్తి తన సహచరుడితో ఇలా అన్నాడు.. నాకు జీవితంపై ఆసక్తి లేదని, ఆ ఇద్దరు చాలా దారుణంగా మోసం చేశారని నావల్ల కాదని చెప్పిన  వినడం లేదని అన్నారు.. అంతేకాదు నా మనసేమి బాగోలేదు నన్ను ఇబ్బంది పెట్టొద్దని ఆ ఇద్దరితో ఎంత మొత్తుకున్నా వారు నన్ను ఇబ్బంది పెడుతూనే ఉన్నారు.. వారు నా జీవితాన్ని సర్వనాశనం చేశారు, ఎంతో సంతోషంగా ఉన్న కుటుంబాన్ని చిన్నభిన్నం చేశారని మాట్లాడాడు.. విజయ పిల్లలను తలుచుకుంటూనే చాలా బాధనిపిస్తోంది అంటూ తన సహచరుడితో ఫోన్ లో  చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా  తన సహచరుడు ఎంత బ్రతిమిలాడిన వినకుండా ఏడుస్తూనే ఉన్నాడు..నేను పై అధికారి వద్దకు వెళ్లలేను .

ఎవరికి సంజయిషి చెప్పుకోలేను, ఇక నా వల్ల కావడం లేదు అంటూ చివరి మాటలు ఏడుస్తూ తన సహచరుడితో చెబుతున్న ఆడియో ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.. ఈ ఆడియోలో అసలు ఆయనను ఇబ్బంది పెట్టిన ఇద్దరు ఎవరు, ఎస్ఐ మూర్తి ఆత్మహత్య చేసుకొని చనిపోవలసిన అవసరం ఏమొచ్చింది? అనేది చాలా ఆసక్తికరంగా మారింది.. దీనిపై పోలీసులు దర్యాప్తు చేసి  ఎస్సై ఆత్మహత్యకు కారణమైన ఇద్దరిని  పట్టుకొని శిక్షిస్తారా లేదంటే సైలెంట్ గా ఉంటారా అనేది ముందు ముందు తెలుస్తుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: