తిరుపతిలో తాజాగా జరుగుతున్న  డిప్యూటీ మేయర్ ఎన్నికలు వివాదాస్పదంగా మారుతూ ఉన్నాయి. ఎన్నికలలో పాల్గొన్నటువంటి వైసీపీ కార్పొరేట్లను సైతం కూటమినేతల సైతం బంధిస్తున్నారంటూ వైసీపీ ఇన్చార్జ్ భూమన అభినయ్ రెడ్డి పలు రకాల ఆరోపణల సైతం చేస్తూ ఉన్నారు. వీరందరిని చిత్తూరులోని ఒక ప్రైవేటు హోటల్లో బంధిస్తున్నారంటూ ఆయన ఒక వీడియోను విడుదల చేయడం తిరుపతిలో సంచలనంగా మారింది. తాము చెప్పిన వారికి మద్దతు ఇవ్వకుంటే చంపేస్తామంటూ బెదిరిస్తున్నారంటూ భూమన అభినయ్ రెడ్డి వెల్లడించారు.



జనసేన ఎమ్మెల్యే కుమారుడు అయినటువంటి అరణి మదన్ నిన్నటి రోజున అర్ధరాత్రి వైసిపి కార్పొరేట్లను సరిత కిడ్నాప్ చేశారని పలు రకాల సంచలన విషయాలుగా మారుతున్నాయి.. వైసిపి కార్పొరేట్లను బలవంతంగా అక్కడ ఎందుకు ఉంచారని ఆ ప్రాంతం నుంచి వారిని పంపించాలంటూ కొంతమంది నేతలు కోరగా వారిని అడ్డుకునే ప్రయత్నం చేయగా కూటమినేతలతో పాటుగా ఇరువురి వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నదట. దీంతో పోలీసులు అక్కడికి రావడంతో వైసిపి కార్పొరేటర్లు అక్కడి నుంచి వీలు తిరిగిపోయినట్లు సమాచారం.


వైసిపి కార్పొరేటర్ రాజేష్ ను ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా పోలీసులు సైతం అరెస్టు చేశారంటూ వైసీపీ నేత అభినయ్ రెడ్డి ఆరోపణలు చేయడం జరిగింది. సురేష్ అరెస్టును సైతం తెలుసుకున్న ఆయన అలిపిరి పోలీస్ స్టేషన్ కి వెళ్ళగా వైసిపి కార్పొరేటర్ రాజేష్ ని బయటికి పంపించాలంటూ పోలీసులతో వాగ్వాదానికి సైతం దిగారట అభినయ్ రెడ్డి. సోమవారం ఉదయం 11 గంటల వరకు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్స్ ఎన్నికలు జరగబోతున్నాయి ఈ క్రమంలోనే ఇలా వైసిపి కార్పొరేటర్లను ఓటింగ్లో పాల్గొనకుండా చేసేందుకే కూటమినేతలు కుట్రపారుతున్నారనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే అరణి శ్రీనివాస్ కుమారుడైన అరణి మదన్, టిడిపి నేతలు పులిగోర మురళి, జేబీ శ్రీనివాసులు, కృష్ణ యాదవ్ వంటి వారు వచ్చారని అయితే పోలీసులు అక్కడికి రావడంతో వెనక్కి తగ్గారంటూ అభినయ రెడ్డి వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: