హిందూపురం మున్సిపల్ ఛైర్మన్ పదవిని కైవసం చేసుకుంది తెలుగు దేశం పార్టీ. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ.. దగ్గరుండి చక్రం తిప్పడంతో.. హిందూపురం మున్సిపల్ ఛైర్మన్ పదవిని కైవసం చేసుకుంది తెలుగు దేశం పార్టీ. ఈ దెబ్బకు హిందూపురం మున్సిపల్‌ ఛైర్మన్ గా టీడీపీ అభ్యర్థి, ఆరో వార్డు కౌన్సిలర్ రమేశ్ ఎన్నిక కావడం జరిగింది. ఈ హిందూపురం మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికలో టీడీపీ అభ్యర్థి, ఆరో వార్డు కౌన్సిలర్ రమేశ్ కు అనుకూలంగా 23 ఓట్లు రావడం జరిగింది.


ఇక టీడీపీ ప్రత్యర్థి... వైసీపీ అభ్యర్థి లక్ష్మికి అనుకూలంగా 14 ఓట్లు వచ్చాయి.  అటు ఓటింగ్ లో పాల్గొన్న ఎమ్మెల్యే బాలకృష్ణ, ఎంపీ పార్థసారథి.. టీడీపీ పార్టీని దగ్గరుండి గెలిపించారు. అయితే... హిందూపురం మున్సిపల్ ఛైర్మన్ పదవి విషయంలో.. వైసీపీ పార్టీ ఎత్తుగడలు చిత్తు అయ్యాయి. వైసీపీ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లు అందరికీ.... విప్‌ జారీ చేశారు. అయినప్పటికీ... వైసీపీ అభ్యర్థి లక్ష్మికి అనుకూలంగా 14 ఓట్లు మాత్రమే వచ్చాయి.

అటు  టీడీపీ అభ్యర్థి, ఆరో వార్డు కౌన్సిలర్ రమేశ్  కు అనుకూలంగా 23 ఓట్లు రావడం తో టీడీపీ విజయాన్ని వైసీపీ పార్టీ ఆపలేకపోయింది. దీంతో..హిందూపురం మున్సిపల్ ఛైర్మన్ పదవి టీడీపీ అభ్యర్థి, ఆరో వార్డు కౌన్సిలర్ రమేశ్ కు వరించింది. ఇక ఈ విజయంతో... హిందూపురం లో సంబరాలు చేసుకుంటోంది టీడీపీ పార్టీ.  అయితే... ఈ ఓటమిపై వైసీపీ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.


YSRCP కౌన్సిలర్లకు ఒక్కొక్కరికి పది లక్షలు.. నందమూరి బాలకృష్ణ వల వేశారని ఆరోపణలు చేస్తున్నారు వైసీపీ నేతలు. ఇక ఇది ఇలా ఉండగా... ఏలూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ డిప్యూటీ మేయర్లుగా దుర్గాభవాని, ఉమామహేశ్వరరావు ఎన్నిక కావడం జరిగింది. ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఇద్దరు దుర్గాభవాని, ఉమామహేశ్వరరావు. అటు ఈ ఎన్నిక ప్రక్రియకు దూరంగా వైసీపీ కార్పొరేటర్లు ఉన్నారు. ఎన్నికల అధికారిగా  జాయింట్‌ కలెక్టర్...వ్యవహరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: