నిన్నటి రోజున ముద్రగడ పద్మనాభ రెడ్డి ఇంటి మీదకి జనసేన కార్యకర్తలలో ఒకరైన ఒక యువకుడు ట్రాక్టర్ తో దూసుకు వెళ్లి మరి తన ఇంటి మీదకి దాడికి దిగారు. దీంతో ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ ఉలిక్కిపాటికి గురైంది ఇందులో ముద్రగడ కారు డ్యామేజ్  అయినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఆ యువకుడిని పోలీసులు కూడా పట్టుకొని నిన్నటి రోజున విచారిస్తున్నారట. తాజాగా ముద్ర పద్మనాభరెడ్డికి జరిగిన ఈ విషయం పైన ఆయన కుమార్తె జనసేన నాయకురాలు బార్లపూడి క్రాంతి ఇటీవలే సమావేశంలో మాట్లాడుతూ పలు విషయాలను తెలిపింది.



మాజీ మంత్రి అయిన ముద్రగడ పద్మనాభ ఇంటి పైన జరిగిన దాడిని తాను చాలా తీవ్రంగా ఖండిస్తున్నానని తన తండ్రికి ఇంటిపైన ఇలా జరగడం తనకు చాలా బాధగా ఉందని జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఇటువంటి దాడులను వ్యతిరేకమని తెలిపింది.. డబ్బులు ఇచ్చి మరి జనసేన నాయకులు చేయించారనే ఆరోపణలు పూర్తిగా అవాస్తవం అంటూ తెలిపింది. దాడి వెనుక ఎంతటి పెద్దవారు ఉన్నారనే విషయాలను అధికారులు బయటపెట్టి చర్యలు తీసుకోవాలి అంటు తెలిపింది.



అయితే ఈ విషయం పైన జనసేన నేతలు తనకు హామీ ఇచ్చారని పోలీసులు ఈ దాడి వెనుక ఉన్న గుట్టును కూడా వెలుగులోకి తీసుకురాబోతున్నారంటూ తెలియజేశారు. మతిస్థిమితం లేని ఒక వ్యక్తి ఈ దాడికి పాల్పడి ఉంటారని విధంగా ముద్రగడ కుమార్తె తెలియజేసింది. ముద్రగడ ఇంటికి ట్రాక్టర్ నడుపుకుంటూ వచ్చి ట్రాక్టర్ తో గేటును బద్దలు కొట్టుకొని మరి ఇంటి లోపలికి వెళ్లి కారును ఢీకొట్టారట ఆ వ్యక్తి.. అంతే కాకుండా ఫ్లెక్సీలను కూడా చించి వేశారని అనంతరం అక్కడ జై జనసేన అంటూ పలు రకాల నినాదాలు చేయడంతో ఒక్కసారిగా రాజకీయ వేడి అక్కడ మొదలయ్యిందట. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఆ నిందితుడని అదుపులోకి తీసుకున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: