తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్ష పదవి త్వరలోనే నియామకం చేస్తారని గత ఆరు నెలలుగా ప్రచారం జోరుగా సాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత... అధ్యక్ష పదవి భర్తీ చేస్తారని కొంతమేర ప్రచారం చేశారు. అప్పటికే పార్లమెంట్ ఎన్నికలు... రావడం జరిగింది. కానీ అప్పుడు కూడా కిషన్ రెడ్డి నే కొనసాగించారు. రెడ్డి సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం ఎక్కువగా ఇచ్చింది బిజెపి పార్టీ. దీంతో బిజెపి బీసీ వాదన పని చేయడం లేదు.

 ఇలాంటి నేపథ్యంలోనే ఈసారి బిజెపి నాయకుడికి అధ్యక్ష పదవి ఇవ్వాలని... అధిష్టానం అనుకుంటుందని సమాచారం అందుతోంది. ఇందులో భాగంగానే ఈటల రాజేందర్ అలాగే నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పేర్లు తెరపైకి వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరు బీసీ సామాజిక వర్గ నేతలు. అందుకే ఈ ఇద్దరిలో ఒకరిని అధ్యక్ష పదవికి నియామకం చేయాలని అనుకుంటున్నారట. అయితే ఈ లిస్టులో బండి సంజయ్ పేరు మాత్రం లేదు అని అంటున్నారు.

 అయితే బీసీలకు... ఈసారి అధ్యక్ష పీఠం రాకుండా... డీకే అరుణ అలాగే మురళీధర్ రావు పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరు నాయకులు వెలమ అలాగే రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు. వీళ్లలో ఒకరికి తెలంగాణ బిజెపి అధ్యక్ష పదవి వస్తే... కొత్తగా తెలంగాణ బిజెపి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి క్రియేట్ చేయాలని అనుకుంటున్నారట. ఆ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఈటెల రాజేందర్ లేదా ధర్మపురి అరవింద్ లాంటి బీసీ నేతలకు అవకాశం ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారట.

 అదే బీసీ నాయకుడికి అధ్యక్ష పదవి వస్తే... వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి అసలు ఉండబోదని చెబుతున్నారు. దీంతో... తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అయితే ఈ ప్రక్రియ మొత్తం ఫిబ్రవరి 15వ తేదీ లోపు జరుగుతుందని అంటున్నారు. ఆ లోపు అధ్యక్షులు ఎవరు అనే దాని పైన క్లారిటీ రానుందట. అధ్యక్ష పదవి భర్తీ చేసిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని బిజెపి ఆలోచన చేస్తోంది. అయితే ఈటల రాజేందర్ కొత్తగా పార్టీలోకి వచ్చారని... ఆయనకు పదవి ఇవ్వకూడదని కొంతమంది నాయకులు డిమాండ్ చేస్తున్నట్లు వార్తలు కూడా వస్తున్నాయి. మరి దీనిపై బిజెపి ఎలా ముందుకు వెళ్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp