వైయస్సార్ కుటుంబంలో గత కొన్ని నెలలుగా ఆస్తి తగాదాలు రావడంతో రాజకీయ విభేదాలు కూడా తలెత్తాయనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ రాజకీయ విభేదాలు అనేది ఎన్నో ప్రాంతాలలో ఉన్నప్పటికీ కానీ ఏపీలో మాత్రం వైయస్ కుమారుడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి, కూతురు షర్మిల మధ్య విభేదాలు రావడంతో తీవ్ర చర్చనీయాంశంగా దారితీసింది. సరిగ్గా ఎన్నికల సమయంలో ఏపీ పీసీసీ చీప్ పదవిని అందుకున్న షర్మిల కేవలం తన అన్ననే టార్గెట్ చేస్తూ ముందుకు వెళ్ళింది.


జగన్ మీద కూడా హాట్ కామెంట్ చేయడంతో కొంతమేరకు ఈ ప్రభావం ఎన్నికలలో పడిందని చెప్పవచ్చు. ఆ తర్వాత పలు రకాల ఆస్తి తగాదుల వ్యవహారంలో కూడా బహిరంగంగానే పలు లేఖలు కూడా రాసింది షర్మిల అటు జగన్మోహన్ రెడ్డి. ఇక సీఎంగా ఉన్న సమయంలో కూడా జగన్ ఏ రోజు కూడా తన నోరు విప్పి చెల్లెలి మీద విమర్శలు చేయలేదు.. ఎందుకంటే ఇది రక్తసంబంధం అని కూడా చెప్పవచ్చు. రాబోయే రోజుల్లో వీరిద్దరు మళ్ళీ కలవవచ్చు అనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి.


అయితే వీరిద్దరిని కలపడానికి విజయసాయిరెడ్డి ఇటీవలే రాజకీయాలకు దూరమయ్యారనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ప్రస్తుతం స్వేచ్ఛగా అందరిని కలుస్తూ ఉన్నారట విజయసాయిరెడ్డి అలా ఇటీవలే వైయస్ షర్మిల ఉంటున్న లోటస్ ఫౌండ్ కి కూడా వెళ్లడం జరిగింది. అక్కడ సుదీర్ఘంగా మూడు గంటల పాటు మాట్లాడుకున్నారని అలాగే రాజకీయ అంశాల పైన కూడా చర్చించుకున్నట్లు సమాచారం. ముఖ్యంగా వైయస్సార్ భార్య విజయమ్మ పిలిచింది అని అన్నాచెల్లెళ్ల మధ్య రాజీ కుదరచడానికి మధ్యవర్తిగా విజయ్ సాయి రెడ్డిని ఉండమని కోరిందని వార్తలు వినిపిస్తున్నాయి. విజయమ్మ కి విజయసాయి రెడ్డి అంటే సోదరుడు అనే భావంతో ఉండడంతో కలుపుతారనే నమ్మకంతోనే ఈ పెద్ద విషయాన్ని సహాయం కింద కోరిందట విజయమ్మ.. మరి ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: