తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగాల్సి ఉండేది. కానీ వైసీపీ ప్రజాప్రతినిధులను కిడ్నాప్ చేశార ని నిన్న వార్త వచ్చిన సంగతి తెలిసిందే. అలాగే వైసిపి నేతలు ప్రయాణిస్తున్న బస్సు పై దాడి కూడా జరిగింది. ఈ నేపథ్యంలో తిరుపతి డిప్యూటీ మేయర్... ఎన్నిక ఇవాల్టికి వాయిదా పడింది. అయితే ఇవాళ... తమ పార్టీ ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యాన్ని టిడిపి నేతలు కిడ్నాప్ చేశారని... కొత్త వాదన తెరపైకి తీసుకువచ్చింది వై సి పి పార్టీ.
అర్ధరాత్రి తర్వాత... తమ ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం ను తన ఇంటి నుంచి తీసుకు వెళ్లినట్లు వైసీపీ నేతలు చెబుతున్నారు. అయితే దీనిపై ఇంకా క్లారిటీ రాలేదు. డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో ఎక్స్ అఫీషియల్ సభ్యుడిగా ఉన్న... ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం ఓటు చాలా కీలకం. అందుకే ఆయనను కిడ్నాప్ చేసినట్లు వైసిపి నేతలు ఆరోపణలు చేస్తున్నారు.
ఇక ఇలాంటి పరిణామాల నేపథ్యంలో నేడు తిరుపతి నగరపాలక డిప్యూటీ మేయర్ ఎన్నిక నిర్వహించనున్నారు అధికారులు. భూమన అభినయ రెడ్డి రాజీనామాతో ఖాళీ ఏర్పడ్డ డిప్యూటీ మేయర్ స్థానం కు పోటీ జరుగుతున్న సంగతి తెలిసిందే. అటు పట్టు నిలుపుకునే ప్రయత్నంలో వైసిపి ఉన్న సంగతి తెలిసిందే. ఇటు డిప్యూటీ మేయర్ స్థానంపై కన్నేసిన కూటమి...విశ్వప్రయత్నాలు చేస్తోంది.