తెలంగాణ రాష్ట్రంలో త్వరలోనే పది నియోజకవర్గాలలో బై ఎలక్షన్స్... వస్తాయని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. దీనికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఏ క్షణమైనా తెలంగాణలో ఉప ఎన్నికలు రావచ్చని అంటున్నారు. సుప్రీంకోర్టు కూడా ఆ దిశగా నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇటీవల కాలంలో... టిఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి.. ఏకంగా పదిమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే..


మొదట దానం నాగేందర్... కాంగ్రెస్ కండువా కప్పుకోగా... ఆ తర్వాత తెల్లం వెంకటరావు జంప్ అయ్యారు. అనంతరం ఎంపీ టికెట్ తన కూతురికి ఇచ్చినప్పటికీ కూడా... పదవులు అనుభవించి కడియం శ్రీహరి కూడా జంప్ అయ్యారు. ఈ ముగ్గురు కాంగ్రెస్ గూటికి వెళ్లిన తర్వాత... కొంతమంది హైడ్రా అలాగే ఇతర బిల్లుల నేపథ్యంలో... అధికార పార్టీలో చేరారు. ఇలా మొత్తం పదిమంది ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ టికెట్ ద్వారా గెలిచి... కాంగ్రెసులోకి వెళ్లడం జరిగింది.


అయితే కాంగ్రెస్ లోకి వెళ్లిన పదిమంది ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని రద్దు చేయాలని ఇప్పటికే... స్పీకర్ కు లేఖ ఇచ్చింది గులాబీ పార్టీ. అయినప్పటికీ తెలంగాణ స్పీకర్ ఏ మాత్రం స్పందించలేదు. అటు హైకోర్టును కూడా ఆశ్రయించింది గులాబీ పార్టీ. అయితే హైకోర్టు కూడా వాళ్లపై చర్యలు తీసుకోవాలని స్పీకర్కు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. అయినప్పటికీ గడ్డం ప్రసాద్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఈ నేపథ్యంలోనే దేశ అత్యున్నత న్యాయస్థానం.. సుప్రీంకోర్టుకు వెళ్ళింది గులాబీ పార్టీ. 

ఇక పార్టీ ఫిరాయింపుల కేసు నేపథ్యంలో సుప్రీంకోర్టు కూడా ఈ కేసు  బాగా స్టడీ చేసి విచారణ చేసింది. వెంటనే పదిమంది ఎమ్మెల్యేలపై యాక్షన్ తీసుకోవాలని స్పీకర్కు తాజాగా ఆదేశాలు కూడా ఇచ్చింది సుప్రీంకోర్టు. ఈ నెల 9వ తేదీన... మళ్లీ ఈ కేసును విచారణ చేయనుంది సుప్రీంకోర్టు. ఆ సందర్భంగా తెలంగాణ స్పీకర్ వేటు వేయకపోతే... స్వయంగా సుప్రీంకోర్టు రంగంలోకి దిగి 10 మంది ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని రద్దు చేసే ఛాన్స్ ఉందని రాష్ట్ర విశ్లేషకులు చెబుతున్నారు. దీనికి తగ్గట్టుగానే కేటీఆర్ కూడా ఉప ఎన్నికలకు సిద్ధం కావాలని గులాబీ పార్టీ నేతలను అలర్ట్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: