కాంగ్రెస్ లో చేరిన 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది.  ఇవాళ కాంగ్రెస్ లో చేరిన 10 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ అయ్యాయి. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ఊహించని షాక్ ఇస్తూ... కాంగ్రెస్ లో చేరిన 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు తెలంగాణ రాష్ట్ర శాసనసభ కార్యదర్శి.  బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ వేసిన పిటిషన్ ఆధారంగా.. ఈ నోటీసులు జారీ చేశారు తెలంగాణ రాష్ట్ర శాసనసభ కార్యదర్శి.


పార్టీ మారడంపై వివరణ ఇవ్వాలని  కాంగ్రెస్ లో చేరిన 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఈ నోటీసుల్లో కోరారు శాసనసభ కార్యదర్శి. అయితే... తెలంగాణ రాష్ట్ర శాసనసభ కార్యదర్శి ఇచ్చిన నోటీసులపై వెంటనే... కాంగ్రెస్ లో చేరిన 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పందించారు.  వివరణ ఇచ్చేందుకు తమకు కొంత సమయం కావాలని కోరారు 10 మంది రెబల్‌ ఎమ్మెల్యేలు. బీఆర్ఎస్ వేసిన అనర్హత పిటిషన్ల ఆధారంగా నోటీసులు ఇచ్చింది తెలంగాణ అసెంబ్లీ.


కాంగ్రెస్ లో చేరిన 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కేటీఆర్‌, బీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు.. ఇటీవలే... సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే... ఈ సందర్భంగా కాంగ్రెస్ లో చేరిన 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కేసును చాలా క్షుణంగా నిన్నటి రోజున విచారించింది. అనంతరం... వెంటనే.... కాంగ్రెస్ లో చేరిన 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ అసెంబ్లీని ఆదేశించింది సుప్రీం కోర్టు.


ఇక సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చిన తరుణంలోనే....  10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు తెలంగాణ రాష్ట్ర శాసనసభ కార్యదర్శి. అయితే... ఈ కేసును ఫిబ్రవరి 9వ తేదీన మరోసారి విచారణ చేయనుంది సుప్రీం కోర్టు. అప్పటి వరకు 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై తెలంగాణ శాసన సభ వేటు వేయకపోతే... సుప్రీం కోర్టు చర్యలు తీసుకునే ఛాన్స్‌ లేకపోలేదని అంటున్నారు. అంటే... ఈ పది నియోజక వర్గాల్లో ఉప ఎన్నికలు గ్యారెంటీ అన్న మాట.

మరింత సమాచారం తెలుసుకోండి:

BRS