ప్రస్తుతం దేశంలో మరిన్ని సివిల్ ఏవియేషన్ కాలేజీలు ఏర్పాటు చేయాలని చెప్పిన రాజ్యసభ ఎంపీ సుధామూర్తి.. విజయపురకు ఎప్పుడు విమానాలు వస్తాయని ప్రశ్నించింది. ఈ మేరకు రాజ్యసభలో ఆమె మాట్లాడుతూ.. కర్ణాటకలో ఫేమస్ టూరిస్ట్ స్పాట్ విజయపుర పర్యాటకుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఎయిర్పోర్ట్ సిద్ధం చేశారు. దీనిపై కర్ణాటక ప్రభుత్వంతో కూడా నేను మాట్లాడాను. అయితే కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తమకు అనుమతి ఇవ్వాలని చెప్పినట్టు తెలిపింది సుధా మూర్తి. ఈ సందర్భంగా ఒక విషయం అడుగుతున్నాను. విజయపురకు విమానాలు ఎప్పుడు ప్రారంభం కానున్నాయి. నేను ఎప్పుడు అడిగినా సరే త్వరలోనే తెలుస్తుంది అని చెబుతున్నారు కానీ ఈసారి అలా కాదు కచ్చితంగా మాకు దీనిపై సమాధానం కావాలి.

ఇప్పటికే దేశవ్యాప్తంగా 54 సివిల్ ఏవియేషన్ కాలేజీలు ఉన్నాయి. 140 కోట్ల భారతీయులకు ఇది చాలా తక్కువ అనేది నా అభిప్రాయం. ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఎన్నో ప్రాంతాల్లో సివిల్ ఏవియేషన్ కాలేజీలు , కేంద్రాలు కూడా లేవు. దీనిపై కేంద్రం ఫోకస్ చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అంటూ ఒక ప్రశ్నను సుధామూర్తి రాజ్యసభలో లేవనెత్తారు.

ఇకపోతే సుధామూర్తి అడిగిన ప్రశ్నకు సమాధానం తెలిపారు పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు.  ఆయన మాట్లాడుతూ.. ఇది తిరుపతికి సంబంధించిన విషయం. కానీ ఇక్కడ సుధా మూర్తి గారు విజయపుర పేరును ప్రస్తావించారు. విజయపురకు త్వరలోనే విమానాలు వస్తాయి. ఇదే ఏడాది మేము అమలు చేస్తాము.కావాలంటే లిఖితపూర్వకంగా కూడా సమాధానం ఇస్తాము. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై పనిచేస్తున్నాయి. సివిల్ ఏవియేషన్ కాలేజీలు 54 మాత్రమే ఉన్నాయి .అందులో పైలెట్ లతో పాటు మెయింటనెన్స్ ఇంజనీర్లకు కూడా ట్రైనింగ్ ఇస్తారు.  మరో మూడు కాలేజీలకు అప్రూవల్ కూడా వచ్చింది. మరో 9 ఏవియేషన్ కాలేజీల కోసం కేంద్రం చర్యలు ప్రారంభించింది.ఇప్పటికే 1500కు పైగా పైలట్ లు  ప్రతి ఏడాది శిక్షణ తీసుకుంటున్నారు. దేశంలో మరిన్ని కాలేజీల అవసరం కూడా ఉంది. కాబట్టి ఎవరైనా ప్రైవేట్ సంస్థలు ఇందుకోసం ముందుకు వస్తే కేంద్ర ప్రభుత్వం దానికి సహకారం కూడా అందిస్తుందని తెలిపారు. అలాగే మరో ఐదు సంవత్సరాలలో 57 ఎయిర్పోర్ట్ లు,  పదేళ్లలో 100 , 20 ఏళ్లలో 200 విమానాశ్రయాలు నిర్మించి విమాన సర్వీసులు పెంచాలని కేంద్రం భావిస్తోంది. మౌలిక సదుపాయాలు కల్పించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము అంటూ రామ్మోహన్ నాయుడు చెప్పిన సమాధానం అందరిని ఆకట్టుకుంటోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: