ఏపీ లో గతేడాది జరిగిన సాధారణ ఎన్నికల్లో వైసీపీ చిత్తుగా ఓడిపోయింది. 151 సీట్ల నుంచి ఆ పార్టీ కేవలం 11 సీట్లకు పరిమితం అయ్యింది. ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ నుంచి పలువురు కీలక నేతలు బయటకు వచ్చేస్తున్నారు. చాలా మంది అయితే తమ పదవులు వదులుకుని మరీ బయటకు వస్తోన్న పరిస్థితి. అసలు రాజ్యసభ సభ సభ్యులు గా ఉన్న వారు సైతం తమ ఎంపీ పదవులు వదులుకుని పార్టీ నుంచి బయటకు వచ్చేశారు.
తాజాగా మరో వైసీపీ టాప్ లీడర్ ఆ పార్టీకి .. జగన్‌కు హ్యాండ్ ఇచ్చారు. తిరుపతికి చెందిన ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం కూడా వైసీపీ కి ఎవ్వరూ ఊహించని విధంగా దెబ్బ కొట్టారు. ఆయన రాత్రికి రాత్రి తిరుపతిలోని తన ఆస్పత్రి నుంచి మాయమవ్వడంతో అందరూ షాక్ లో ఉండి పోయారు. డిప్యూటీ మేయర్ ఎన్నిక ఉండటంతో ఆయనను వైసీపీ నేతలు ఓ కంట కనిపెట్టుకుని ఉంటున్నారు. ఈ క్రమం లో నే ఆయనకు స్థానిక ఎమ్మెల్సీగా ఎక్స్ అఫీషియో ఓటు ఉంది.
సిపాయి సుబ్రహ్మణ్యం మిగిలిన పార్టీ కార్పొరేటర్లలాగా హ్యాండ్ ఇవ్వరని వైసీపీ నాయకులు అనుకున్నారు. కానీ ఆయన కూటమి నేతలతో మాట్లాడుకుని ఆ క్యాంపు లోకి వెళ్లిపోయారని సమాచారం. దీంతో వైసీపీ వాళ్లు తమ పార్టీ ఎమ్మెల్సీని కూడా కిడ్నాప్ చేశారంటూ ప్రచారం ప్రారంభించారు. ఎన్నికలకు ముందు తిరుపతిలో టీడీపీకి ఒకే ఒక్క కార్పోరేటర్ మాత్రమే ఉండేవారు. అయితే ఇప్పుడు క్రమ క్రమంగా ఒక్కో కార్పోరేటర్ తమ పార్టీని వీడుతూ కూటమి పార్టీ ల్లో చేరిపోతున్నారు. ఓవరాల్ గా చూస్తే తిరుపతి వైసీపీ కకావికలం అవుతోంది. ఇది మాజీ ఎమ్మెల్యే భూమన కరుణా కర రెడ్డికి పెద్ద ఎదురు దెబ్బే అనుకోవాలి.