ఆంధ్రప్రదేశ్లో గత వైసిపి ప్రభుత్వం ఉన్న సమయంలో వైయస్ జగన్ కు ఆపోజిట్ గా ఎంపీ రఘురామకృష్ణంరాజు ఎప్పుడు మాట్లాడుతూ ఉండేవారు.. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం టిడిపిలో ఎమ్మెల్యేగా ఉండి అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ గా కూడా వ్యవహరిస్తూ ఉన్నారు. అయితే రఘురామ రాజు డిప్యూటీ స్పీకర్ అయినప్పటికీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాలేదు.. మొదట జగన్మోహన్ రెడ్డిని అసెంబ్లీకి రావాలని వ్యక్తిగతంగా కలిసి విజ్ఞప్తి తెలియజేసిన డిప్యూటీ స్పీకర్ రఘురామ.. ఆ తర్వాత స్పందన రాకపోవడంతో ఢిల్లీలో అనర్హత వేటు హెచ్చరికను సైతం తెలియజేశారు.


అసెంబ్లీకి రాకపోవడం సభ్యుల బాధ్యత కాదని ఎవరైనా సరే కచ్చితంగా వరుసగా 60 రోజుల పాటు అసెంబ్లీకి రాకపోతే అనర్హత వేటు వస్తుంది అంటూ రఘురామ జగన్ ను ఉద్దేశించే అనడం చర్చనీ అంశంగా మారింది. అయితే ఎమ్మెల్యేల పైన అనార్హత వేటుకు రాజ్యాంగంలో పలు నిబంధనలు కూడా ఉన్నాయా అనే విషయం ఇప్పుడు వైరల్ గా మారుతోంది. భారత రాజ్యాంగంలో 191 ఆర్టికల్ ప్రకారం ఒక ఎమ్మెల్యేని అనర్హుడిని చేయాలి అంటే.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో సైతం లాభదాయ అనేకమైన హోదాలు ఉండేవారు చేయచ్చట.


అలాగే ఎమ్మెల్యే మానసిక పరిస్థితి బాగా లేకపోయినా కోర్టు అనర్హుడని చేయవచ్చట.. ఒకవేళ ఏదైనా అప్పు తీసుకొని దివాలా తీసిన కూడా ఎమ్మెల్యే పైన అనార్హత వేటు వేయవచ్చు అలాగే భారతదేశ పౌరుడు అయ్యుండి.. ఇతర దేశాలకు పౌరసత్వం తీసుకున్న కూడా అనర్హతేనట.. అయితే వీటిని అంతిమంగా రాష్ట్ర గవర్నర్ మాత్రమే తీసుకోవాలట. అలాగే ఫిరాయింపు నిరోధక చట్టంలో షెడ్యూల్ పదవ ప్రకారం ఎమ్మెల్యేలను అనర్హులుగా కూడా ప్రకటించవచ్చట. ఎమ్మెల్యే స్వచ్ఛందంగా పార్టీ సభ్యత్వాన్ని వదులుకుంటే  అనర్హత వేటు వేయవచ్చట. కానీ పార్టీలో మూడింట ఒక వంతు మంది ఎమ్మెల్యేలు తమ సభ్యత్వాన్ని సైతం వదులుకున్నట్లు అయితే ఫిరాయింపు నిరోధక చట్టంలోని నిబంధనలు సైతం వర్తించదట. కానీ పార్లమెంటు వరకు మాత్రం ఒక ఎంపీ స్పీకర్కు సైతం ఎలాంటి సమాచారం ఇవ్వకుండా 60 రోజులపాటు హాజరు కాకపోతే అనర్హత వేటు వేసి అవకాశం ఉంటుందట. ఈ విషయంపైనే రఘురామ ఈ నియమాన్ని అసెంబ్లీకి వర్తింపజేసి చెప్పి ఉంటారని విధంగా వార్త వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: