ఇక ఇప్పుడు వైసిపి ఎమ్మెల్యేలు ముందు ఉన్న ఆప్షన్ ఒకటే అనర్హత వేటుకు గురికావుటమే .. ఈ రిస్క్ ఎందుకులే అనుకుంటే అందరూ అసెంబ్లీలోనే బలబలలు తేల్చుకుంటామని ముందుకు రావటం .. ఇలా అసెంబ్లీకి వచ్చేందుకు జగన్ రెడ్డి సిద్ధంగా ఉంటారా అన్నది అసలు క్వశ్చన్ .. జగన్ అసెంబ్లీకి వస్తున్నారని వైసీపీ సోషల్ మీడియాలో గట్టి ప్రచారం ఊపందుకుంది .. ఇదే నిజమైతే ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి వస్తారు అసెంబ్లీలో ఏం జరుగుతుందని పక్కన పెడితే ఆయన వస్తే మాత్రం ప్రతిపక్షనేత హోదా ఇచ్చేవరకు రానని చేసినా చాలెంజ్ను పక్కన పెట్టినట్లు అవుతుంది .. కానీ జగన్ మనస్తత్వం దానికి వ్యతిరేకంగా ఉంటుందని మరికొందరు అంటున్నారు .. అందితే జుట్టు అందకపోతే కాళ్లు పట్టుకొనే రకమని ఏమైనా చేయవచ్చని మరికొందరు విశ్లేషిస్తున్నారు.
ఇలా అసెంబ్లీకి వెళ్లకపోతే అందరి పైన ఆటోమేటిక్గా అనర్హత వేటుపడుతుంది .. స్పీకర్ నిర్ణయాన్ని కోర్టులు కూడా కొట్టివేయవు అప్పుడు ఎన్నికలు కచ్చితంగా వస్తాయి .. ఇప్పుడు ఉన్న 11 సీట్లో ఎన్ని గెలుచుకుంటారో చెప్పడం కూడా ఎంతో కష్టం .. ఈ సమయంలో జీరోకు పడిపోతే పార్టీ మూతపడుతుంది .. అయితే ఇక్కడ జగన్ దీన్ని సానుకూలంగా తీసుకొని ప్రజల వద్దకు స్వానుభూతి కోసం పోయే అవకాశం కూడా ఉంది .. ప్రతిపక్షం లేకుండా చేశారని నిందించి .. ఏడుపులు పెడ పబ్బులు పెట్టి ప్రజలను తన వైపు తిప్పుకునేందుకు ప్రయత్నించే అవకాశం కూడా ఉంది .. మరి జగన్ రెడ్డి అలాంటి ఛాన్స్ తెచ్చుకుంటారా .. లేక రిస్క్ ఎందుకులే అని సైలెంట్ గా అసెంబ్లీకి వెళ్తారా అనేది చూడాలి.