అందుకే ఇప్పుడు లాబీయింగ్‌ల సంగతేమో గాని పార్లమెంట్లో విజయ్ సాయి రెడ్డి తరహాలో మాట్లాడడానికి వైవీ సుబ్బారెడ్డి ఎంతగానో ప్రయత్నిస్తున్నాడు .. అందుకే ప్రధానంగా సాక్షి ఆఫీస్ నుంచి వచ్చిన పేపర్లను పార్లమెంట్లో చదవడానికి ప్రయత్నిస్తున్నాడు .. అయితే రాజ్యసభ వైస్ చైర్మన్ ఆయన ప్రసంగాన్ని విని విస్తు పోయారు అంత పెద్ద పెద్ద మాటలు ఎలా మాట్లాడుతున్నారని దానికి సాక్షాలు చూపించకపోతే మీ స్పీచ్ ను రికార్డుల నుంచి తొలగిస్తామని చెప్పిన ప్రసంగం ఎక్కడ ఆపు లుకుండా కొనసాగించారు .. ఇక గతంలో విజయసాయిరెడ్డి కూడా ఇదే పని చేసేవారు .. మీరేం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా అన్న కూడా ఆయన పట్టించుకునే కాదు ..
ఇక వైవి సుబ్బారెడ్డి కూడా ఇప్పుడు పార్లమెంట్లో అదే పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు . ఇక వైవి సుబ్బారెడ్డి పార్లమెంట్లో ప్రసంగించిన మాటలు అన్ని రాష్ట్ర అంశాలే ఉన్నాయి .. ఇక అవన్నీ అసెంబ్లీలో మాట్లాడాల్సిన విషయాలు అసెంబ్లీలో మాట్లాడేందుకు జగన్ రెడ్డికి ధైర్యం చల్లడం లేదు .. కానీ పార్లమెంట్లో మాత్రం తెగ సాక్షి పేపర్ ను చదివేస్తున్నారు .. వాటిని రికార్డుల నుంచి తొలగించితే మాకేంటి తాము మాట్లాడాల్సింది మాట్లాడుతూ అంటున్నారు. తమ పార్టీలో విజయసాయిరెడ్డి లేకపోవడం వల్ల లోటు ఏమీ లేదు అనేది నిరూపించే ప్రయత్నంలో వైవి సుబ్బారెడ్డి ఇప్పుడు బిజీగా ఉన్నారు.