
కాగా, మీనాక్షి చౌదరి నటించిన ఈ చిత్రం గత సంవత్సరం వినాయక చవితి పండుగ సందర్భంగా విడుదలైంది. ఆ తర్వాత ఈ బ్యూటీ హిట్ లిస్ట్ లో చేరిన చిత్రం లక్కీ భాస్కర్. ఈ సినిమా గత సంవత్సరం సంక్రాంతి కానుకగా రిలీజ్ అయింది. ఈ సినిమాకు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించగా దుల్కర్ వహించారు. ఇందులో మలయాళ యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించాడు.
ఈ సినిమా మంచి విజయాన్ని అందుకొని బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది. ఇక సంక్రాంతి కానుకగా బ్లాక్ బస్టర్ సినిమాగా లక్కీ భాస్కర్ సినిమా నిలిచింది. అనంతరం టాలీవుడ్ లో అనిల్ రావిపూడి దర్శకత్వంలో మీనాక్షి చౌదరి నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ఫిల్మ్ సంక్రాంతికి వస్తున్నాం. ఈ సినిమాలో ఈ బ్యూటీ వెంకటేష్ కు ఎక్స్ లవర్ పాత్రలో పోలీస్ ఆఫీసర్ గా నటించింది.
ఈ సినిమాకు రాజు నిర్మాతగా వ్యవహరించారు. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ. 300 కోట్లకు పైగా కలెక్షన్ రాబట్టింది. ఇక కేవలం నాలుగు నెలలలోనే ఈ బ్యూటీ నటించిన మూడు సినిమాలు బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్నాయి. దాదాపు రూ. 850 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టిన లక్కీ చామ్ గా ఈ బ్యూటీ పేరు మార్మోగిపోతోంది. అంతేకాకుండా టాలీవుడ్ సినిమాల్లో ఈ బ్యూటీకి వరుసగా సినిమా అవకాశాలు రావడం విశేషం.