చైనా వర్సెస్ అమెరికా యుద్ధం మళ్లీ మొదలైనట్లు వార్తలు వస్తున్నాయి. ఎప్పుడైతే... అమెరికా అధ్యక్షుడుగా ట్రంప్ బాధ్యతలు తీసుకున్నారో... అప్పటి నుంచి ప్రత్యేక నిబంధనలను... రూల్స్ ను అమెరికాలో అమలు చేస్తున్నారు. పాత రూల్స్ అన్ని తొలగించి కొత్త రూల్స్ అమలు చేస్తున్నారు డోనాల్డ్ ట్రంప్. తన రూటే సపరేట్ అంటూ... దుమ్ము లేపుతున్నారు. ఈ నేపథ్యంలో... అమెరికాలో అక్రమంగా ఉన్నటువంటి వలసదారులను కూడా... బయటకు పంపిస్తున్నారు ట్రంప్.

 అయితే ఇలాంటి నేపథ్యంలోనే... అమెరికా వర్సెస్ చైనా మధ్య గొడవలు ప్రారంభమైనట్లు సోషల్ మీడియాలో వార్తలు ప్రచారం జరుగుతున్నాయి. రెండు అతిపెద్ద ఎకనామిక్  దేశాలు అమెరికా అలాగే చైనా. అయితే ట్రంప్ అధ్యక్షుడు అయిన తర్వాత... అమెరికా వర్సెస్ చైనా మధ్య ట్రేడ్ వార్... మొదలైందని సోషల్ మీడియాలో వార్తలు తెగ హల్చల్ చేస్తున్నాయి. అగ్రరాజ్యం అమెరికా పైన చైనా ప్రతికార టారిఫ్ ఇప్పటికే ప్రారంభించింది.

 అగ్రరాజ్యం అమెరికా నుంచి దిగుమతి చేసుకునే బొగ్గు అలాగే lng ఉత్పత్తులపై.... అమాంతం సుంకాలు పెంచేసింది చైనా. పైన చెప్పిన ఉత్పత్తుల పైన 15% సుంకం పెంచింది చైనా దేశం. అలాగే... క్రూడ్ ఆయిల్ వ్యవసాయ యంత్రాలు పెద్ద కార్లు పికప్ ట్రక్స్  ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వస్తువుల పైన 10% సుంకాలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది చైనా.  ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది.

 చైనా విధించిన సుంకాలు ఫిబ్రవరి 10వ తేదీ నుంచి అమలులోకి వస్తాయని ఇప్పటికే అధికారిక ప్రకటన విడుదలైంది. అయితే దానిపై... ట్రంప్ ప్రభుత్వం కౌంటర్ ఇవ్వాలని డిసైడ్ అయిపోయింది. చైనా వస్తువులపై కూడా ట్రంప్ ప్రభుత్వం 10% టారిఫ్... అమలు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ శనివారం నుంచి ఈ టారిఫ్స్... అమలు చేసేందుకు ట్రంప్ కూడా నిర్ణయం తీసుకున్నారు. దీంతో రెండు దేశాల మధ్య ట్రేడ్ మొదలైందని ప్రచారం జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: