ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ గా ప్రస్తుతం rrr ఉన్నారు. తాజాగా ఈయన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన చేసిన వ్యాఖ్యలు రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఆయన ప్రాతినిధ్యం  వహిస్తున్న పులివెందుల నియోజవర్గంలో త్వరలోనే ఉప ఎన్నికలు రావచ్చు అనే విధంగా మాట్లాడడం జరిగింది. అయితే దీనిపైన కొన్ని షరతులు ఉంటాయనే విధంగా కూడా తెలియజేశారు.. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వరుసగా 60 రోజులు హాజరు కాకపోతే తన సభ్యత్వాన్ని కూడా రద్దవుతుందనే విధంగా మాట్లాడడం జరిగింది రఘురామకృష్ణంరాజు.


ముఖ్యంగా ఢిల్లీలో ఈ విషయాన్ని మాట్లాడారు.. ప్రతిపక్ష హోదా కోసం వేసుకున్నటువంటి కేసుకి అసెంబ్లీ సభ్యత్వ రద్దుకే సైతం ఎలాంటి సంబంధం లేదనే విధంగా మాట్లాడారు RRR. శాసనసభలలో ఎవరైనా సభ్యుడు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోతే సెలవుల అభ్యర్థనను ఇవ్వాల్సి ఉంటుందనే విధంగా తెలియజేశారు. ప్రతిపక్షం అనేది ప్రజలు నిర్ణయిస్తారు అంటూ తెలిపారు. అసెంబ్లీకి వచ్చి అంతకం చేసి వెళ్లిపోయిన కూడా ఎమ్మెల్యే పదవి కొనసాగుతుందనే విధంగా మాట్లాడారు రఘురామ కృష్ణంరాజు.


ఇప్పటివరకు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి 60 రోజులపాటు అసెంబ్లీకి రాలేదని దీంతో ఉప ఎన్నికలు తప్పవనే విధంగా రఘురాము మాట్లాడడంతో దీనిపైన చాలామంది విశ్లేషకులు భిన్న అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఒకవేళ ఇలాంటి నిర్ణయం తీసుకుంటే ఎలాంటి సమస్యలకు దారితీస్తుందో అనే ప్రశ్న కూడా ఇప్పుడు మొదలవుతోంది. ఇలాంటి సమయంలో గతంలో చంద్రబాబు నాయుడు వైసిపి ప్రభుత్వం హయాంలో అసెంబ్లీలోకి అడుగు పెట్టాను అంటూ తెలియజేశారు. ఆయన సభ్యత్వం రద్దు చేయలేదు కదా? మరి జగన్ విషయంలోనే rrr ప్రస్తావించడం ఎందుకు అన్నట్లుగా ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా రఘురామ చేస్తున్న వ్యాఖ్యలకు ఆయన హోదాకు సంబంధం లేకుండా ఉన్నాయని విషయం తీవ్ర వ్యతిరేకతకు దారితీస్తున్నది. ఇలాంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు కచ్చితంగా ఆచితూచి అడుగులు వేయాలి దీనివల్ల అధికార పక్షాలు కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది అంటూ పలువురు విశ్లేషకులు తెలుపుతున్నారు.. మరి ఏం జరుగుతుందన్నది చూడాలి

మరింత సమాచారం తెలుసుకోండి: